Wednesday, September 20, 2017


శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే

అమ్మవారి అలంకరణలు….

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి – శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి

2వ రోజు – ఆశ్వయుజ విదియ – శ్రీ బాలా త్రిపురసుందరీదేవి

3వ రోజు – ఆశ్వయుజ తదియ – శ్రీ గాయత్రి దేవి

4వ రోజు – ఆశ్వయుజ చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి

5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి

6వ రోజు – ఆశ్వయుజ షష్టి – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి

7వ రోజు – ఆశ్వయుజ సప్తమి – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి

8వ రోజు – ఆశ్వయుజ అష్టమి – శ్రీ దుర్గా దేవి – దుర్గాష్టమి

9వ రోజు – ఆశ్వయుజ మహానవమి – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి

10వ రోజు – ఆశ్వయుజ దసమి – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి ? అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి

ఈ దసరా ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజులు దుర్గాష్టమి, మహార్నవమి, విజయదసమి. ఈ రోజులలో అమ్మవారికి విశిష్ట పూజలు జరుపుతారు.

ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.

పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను.

ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.

ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను.

ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.

అపరాజితా శమీపూజశమీ శమతే పాపం శమీ శతృ వినాశనం
అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి:

మధ్యే అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమః ఇతి జయాం నామతః
ఉమాయైనమః ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమః జయాయైనమః విజయాయై నమహ్



అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము. కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు.

Tuesday, September 19, 2017


బతుకమ్మ పండుగ విశిష్టత

నీలాకాశాన్ని సిబ్బిగా మలచి సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతినే దేవతగా పూజించే పండుగ “బతుకమ్మ పండుగ”. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ ఇది
‘భట్టునరసింహ’  అనే రాజు కవిచోళ దేశం పరిపాలించేవాడు.  ఆయన చాలా ధర్మాత్ముడు. అతని భార్య సత్యవతి. ఒక యుధ్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి రాజు తన భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన శ్రీమహాలక్ష్మీదేవిని మనసున తలచి గొప్ప తపస్సు చేశాడు. కొంత కాలానికి శ్రీమహాలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది. మాకు సంతానం లేక బాధపడుతున్నాము తల్లీ! మమ్ములను కరుణించి నీవే మా కుమార్తె గా జన్మించాలని వేడుకున్నారు. అందుకు ఆమహా లక్ష్మీదేవి సంతోషించి తథాస్తు అన్నది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీమహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూచి మునులు, ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుండి ఆమెను “బతుకమ్మ” అని పిలవసాగారు. బతుకమ్మ జన్మించిన కొంత కాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందంగా జీవించారు. బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయస్సు వచ్చింది. శ్రీమహావిష్ణువు చక్రాంకుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు. ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్య పరిపాలన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు.
బతుకమ్మను కొంతమంది గౌరమ్మగా భావిస్తారు. కొంతమంది బొడ్డమ్మగా పిలుస్తారు. బతుకమ్మను పేర్చి స్త్రీలు, పిల్లలు లయ బద్దంగా పాడుతూ బతుకమ్మను ఆడతారు.
శ్రీ చక్రానికి ప్రతిరూపంగా తలచి బతుకమ్మను ఒక పళ్ళెంలో రంగు రంగు పూలతో గుండ్రంగా ఎత్తుగా పేర్చుతారు. పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పైన పెడతారు. బతుకమ్మను దేవుని ముందు ఉంచి, పూజలు చేసి ఇంటి ముందర పెట్టి ఇరుగు పొరుగు స్త్రీలు కూడా తాము చేసిన బతుకమ్మలను తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టి అందరూ కలిసి లయబధ్ధమైన అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!” అని ఒకరు పాడగా మిగతా వారు అందరూ ఆమె పాడిన విధంగా పాడతారు. ఈ బతుకమ్మ పాటలలో ఎన్నో నీతులు, ఎన్నో సంప్రదాయ విలువలు నిండి ఉంటాయి.
బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో, సంప్రదాయంగా, వేడుకగా జరుపుకునే పూలపండుగ ఇది.
తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగే ఈ పండుగ మన వాకిట్లో బతుకు తెరువును ఆవిష్కరిస్తుంది. ఆట పాటలతో మనల్ని సేద తీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది.
తెలంగాణ సాంస్కృతిక జీవనా వైవిధ్యం ఇతర ప్రాంతాలకు భిన్నం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పండుగ ఇది. వర్షా కాలం ముగిసి జల వనరులు సమృధ్ధిగా నిండి, పూలు బాగా వికసించే కాలంలోబతుకమ్మ పండుగ వస్తుంది.
తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, గన్నేరు, రుద్రాక్ష, బంతి, చేమంతి, బీర, కాకర వంటి పూలతో బతుకమ్మను అందంగా పేర్చుతారు. పేర్చిన పూల మధ్య, గుమ్మడిపూల మధ్యలో ఉండే పుప్పొడి లేదా పసుపు ముద్దను ఉంచి, పక్కన మట్టి ప్రమిదలో దీపాన్ని, అగర్వత్తులను వెలిగించి పూజిస్తారు. బతుకమ్మ పండుగ అన్ని రోజులు పల్లెలు, పట్నాలు పూలవనాలౌతాయి.
ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ప్రకృతితో మమేకమై ఆట పాటలతో, ఆనదోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ నాటికే ప్రకృతి అంతా పూలవనంగా మారుతుంది. ప్రకృతిలో సేకరించిన మాలను ప్రకృతికే సమర్పించడం అనే ఉద్దేశ్యంతో బతుకమ్మలను నీటిలో విడిచి పెడతారు.

Saturday, September 16, 2017

బ్రహ్మోత్సవాలు....
Image result for బ్రహ్మోత్సవాలు....


తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయినబ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.
బ్రహ్మోత్సవాలు మొత్తం నాలుగు రకాలు
బ్రహ్మోత్సవాలలో రకములు
నిత్య బ్రహ్మోత్సవం...
ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.
శాంతి బ్రహ్మోత్సవం.....
కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.
శ్రద్ధా బ్రహ్మోత్సవాలు....
ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు
ఒకరోజు బ్రహ్మోత్సవం....
రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు
1.మొదటి రోజు
ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.


2. రెండో రోజు
శేషవాహనం
ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. వెుదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.
గతంలో స్వామివారి ఊరేగింపునకై రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడారోజుల్లోనూ వాహనసేవ జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం కద్దు. రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా వూరేగటం విశేషం

3. మూడో రోజు
సింహవాహనం
మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. ఆరోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు.


4. నాలుగవ రోజు
కల్పవృక్ష వాహనం
నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారమన్నది వేరుగా చెప్పేదేముంది! ఆరోజు సాయంత్రం, సర్వభూపాల వాహనంమీద స్వామివారి వూరేగింపు, భక్తులకు కనులవిందుగా సాగుతుంది.


5. ఐదవ రోజు
మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ (గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.
గరుడ వాహనం
స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.
ఆరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది. హనుమంతుడుశ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది


6.ఆరవ రోజు
గజవాహనం
ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేననీ అలనాడు 'సిరికింజెప్పక, శంఖుచక్ర యుగమున్‌ చేదోయి సంధింపక' వచ్చినా, నేడు భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచే ఘట్టం- గజవాహనసేవ.


7.ఏడవ రోజు
సూర్యప్రభ వాహనం
Image result for సూర్యప్రభ వాహనం
ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం.


8. ఎనిమిదవ రోజు
శ్రీవారి రథోత్సవం

ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథంవిషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.


9. తొమ్మిదవ రోజు
చక్రస్నానం

బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

ధ్వజావరోహణ

చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే! లక్షలాది భక్తులు ఆ వేడుకల్లో ఆనందంగా పాల్గొనగలిగేది ఏడాది గడిచాకే!!

collected by -  

వికీపీడియా

Friday, September 8, 2017

దశావతార స్తుతి:


1. వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ!
మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !
రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే !
2. మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
3. భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
4. హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో
నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయ మాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
5. భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే
వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
6. క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే
భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
7. సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
8. కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
9. దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప
బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
10. శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే


శ్రీ మహాలక్ష్మీ మంత్రము
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయై ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః

అనగా ఈ మంత్రమును జపించువారలకు దారిద్ర్యము తొలగి, రాజ్యలక్ష్మి, సౌభాగ్యాలక్ష్మి, అమృతలక్ష్మి, కామ్యలక్ష్మి, సత్యలక్ష్మి, భోగలక్ష్మి, యోగలక్ష్మి అను అష్టలక్ష్ములు వారి వశమగును. సర్వ సుఖములతో వర్ధిల్లుచుందురు.

ఒక లక్ష జపం చేసినచో మంత్రసిద్ధి యగును . ఈ మంత్ర జపం వల్ల సిరి సంపదలు లభించును. ఇంతేగాదు, ఈ మంత్రజపం వల్ల సమస్తమూ లభించుననీ , సర్వ శ్రేయస్సులకూ ఈ మంత్రజపం మూలామని శాస్త్రగ్రంథములు పెక్కు రీతుల ప్రశంసించుచున్నది.



ద్వాదశ రాశులకూ లక్ష్మీ మంత్రములు
 ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపించాలో దిగువున ఇస్తున్నాం . ఆ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వుల వాక్కు వీటిని గురువుల ద్వారా గాని , పెద్దలద్వారా గాని ఉపదేశం పొంది జపించాలి.

1. మేషం                               ఓం ఐం క్లీం సౌః
2. వృషభం                             ఓం ఐం క్లీం శ్రీం
3. మిథునం                           ఓం క్లీం ఐం సౌః
4. కర్కాటకం                          ఓం ఐం క్లీం శ్రీం
5. సింహం                              ఓం హ్రీం శ్రీం సౌః
6. కన్య                                  ఓం శ్రీం ఐం సౌః
7. తుల                                 ఓం హ్రీం క్లీం శ్రీం
8. వృశ్చికం                            ఓం ఐం క్లీం సౌః
9. ధనుస్సు                           ఓం హ్రీం క్లీం సౌః
10. మకరం                              ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః
11. కుంభం                               ఓం హ్రీం ఐం క్లీం శ్రీం
12. మీనం                                ఓం హ్రీం క్లీం సౌః

ఐం - మంచి విద్యకు, మాట కారితనమునకు.
క్లీం -  కోర్కెలు నెరవేరుటకు. సంపదలకు.
సౌః - ఇది సౌభాగ్యామునకు, ఆరోగ్యము, సకల కార్య విజయం పొందడానికి.
ఈ మూడు బీజములు సరస్వతీ, లక్షీ, పార్వతీ బీజములని అంటారు.
శ్రీం - అమ్మ వారికి చెందిన మంత్రం సంపదలకు, సకల అభీష్టసిద్ధి కలుగుటకు.
హ్రీం - సూర్యబీజము. వ్యాధులు నశించును.

మహా శక్తిగల ఈ మంత్రాలను మన మహర్షులు , అమోఘ తపశ్శక్తితో దేవతలను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.' ఓం, ఐం, క్లీం, హ్రీం, శ్రీం, సౌః
 అనే ఏకాక్షర బీజ మంత్రాలు శక్తివంతమైన మహామంత్రాలలవడానికి ఆయా దేవతల బీజాక్షరాలన్ని  కలిపి జపించాలి.