Monday, February 29, 2016

యోగ విద్య



యోగ  విద్య..!!

          యోగ శక్తులు ప్రదర్శన చేసేవారిని అనుమానించడం అవమానకరంగా మాట్లాడటం సర్వసాధారణం. ఏదో గట్టి దృష్టాంతం మనసుకు హత్తుకుంటే తప్ప మహిమా ప్రదర్శన చేసే వారిని నమ్మని రోజులు దాపురించినవి , నమ్మకాలు ఎప్పుడు సన్నగిల్లునొ అప్పుడే మహిమాత్ములు భూమి పై రావడం తగ్గిస్తారు ... ఏదో 100 సంవత్సరాలకు ఒక్క మహానుబావుడు మనల్ని ఆదుకోడానికి పూనుకుని వచ్చి మనిషికి మించిన శక్తి ఒకటి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నదని నిరూపించి మనవ అహంకారాన్ని సంహరించి మరల స్వధామానికి చేరుతున్నారు . ఆ కోవకి చెందినా వారే సత్యసాయి , షిర్డీ సాయి , ఆది శంకరాచార్య , అక్కల్కోత్కర్ మహారాజ్ , నృశింహ సరస్వతి , రాఘవేంద్ర స్వామి , కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర సరస్వతి , మౌన స్వామి, గణపతి సత్ చిదానంద తదితరులు .. అయితే వీరు ఇప్పుడు లక్షల్లో లేక కోట్లల్లో ఒక్కరే పుడుతున్నారు ..కాని వీరు ప్రదర్శన చేసే విద్యలు పూర్వ కాలం లో ఎందరో చేసేవారు . పూర్వ కాలం లో ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరజ్ఞానం కాదు యోగ శక్తి మరియు సిద్ధులు పొందటమే వెనుకటికి విద్య యొక్క పరమావధి . గురు కులం లో ఇట్టి యోగ శక్తులే నేర్పేవారు. వీటికి ఉదాహరణలే మన పురానములల్లో మనుష్యులు జంతువులతో మాట్లాడటం , ఉన్నవాడు ఉన్నట్టుగా పర్వతం వలె చాలా ఎత్తు పెరగడం లేక ఒక అంగుళం వరకు తగ్గడం లాంటివి ... ఇవ్వి చదివి చాలామంది కల్పిత కధలు అనుకుంటారు కాని ఇవ్వన్ని పాతంజలి యోగ సూత్రములు అనే శాస్త్రములో పతంజలి మహర్షి చాలా స్పష్టంగా వివరించారు . అవ్వి ఈ క్రింద విధంగా ఉన్నవి
          1.  అణిమా సిద్ధి :అతి చిన్న ఆకారంగా మారడం.
హనుమ సముద్రమును దాటే సమయం లో సురస అనే రాక్షసి పెట్టిన పరీక్ష నెగ్గుటకు బొటన వ్రేలంత గా మారి నోట్లోనికి వెళ్ళి సురస యొక్క దంతాలకు చిక్కక బయట పడ్డాడు.
          2.  మహిమాసిద్ధి : అతి పెద్ద ఆకారంగా మారడం .
హనుమంతుడు సముద్రమును దాటాలని సంకల్పించి తన ఆకారమును మహిమా సిద్ధి చే పెంచి ఆ పై దూకాడు.
          3.  లఘిమాసిద్ధి :వాయు సమానమైన బరువుతో ఆకాశ ప్రయాణం చెయ్యడం , నిమిషం లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యడం.
సంజీవిని పర్వతం తీస్కో రావడానికి హనుమస్వామి లఘిమా సిద్ధిని ఉపయోగ పెట్టారు.
          4.  గరిమాసిద్ధి :శరీరము యొక్క బరువు విపరీతంగా పెంచడం
రాముని దూతగా వెళ్ళిన అంగదుడు రావణ కొలువులో , వానరులను తేలిక చేసి మాట్లాడతున్న రావణాసురుని ఉద్దేశించి , మీ కొలువులో ఎవరైనా నా పాదమును జరపగలరేమో ప్రయత్నం చెయ్యండి అని పలుకగా , ఎవ్వరూ ఆ పని చెయ్యలేక చతికిలాపడ్డ విషయం మనకి తెలిసేందే
          4.  గరిమాసిద్ధి :శరీరము యొక్క బరువు విపరీతంగా పెంచడం
రాముని దూతగా వెళ్ళిన అంగదుడు రావణ కొలువులో , వానరులను తేలిక చేసి మాట్లాడతున్న రావణాసురుని ఉద్దేశించి , మీ కొలువులో ఎవరైనా నా పాదమును జరపగలరేమో ప్రయత్నం చెయ్యండి అని పలుకగా , ఎవ్వరూ ఆ పని చెయ్యలేక చతికిలాపడ్డ విషయం మనకి తెలిసేందే
          5.  ప్రపత్తి : ఆకాశమంత ఎత్తు పెరగడం ; దూర శ్రవణం ; దూర దర్శనం ;మనో దర్శనం (మైండ్ రీడింగ్);జంతు భాషలు అర్ధం కావడం తిరిగి వాటి తో సంభాషణ చెయ్యడం; సకల రోగాల ను నయం చెయ్యడం
వామన మూర్తి బలి చక్రవర్తిని సంహరించడానికి ఆకాశమంత పెరగడానికి ఈ విద్య ఉపయోగాపెట్టాడు. దూర దర్శన ,దూర శ్రవణ విద్యల ద్వారా వ్యాస వాల్మీకులు భారత రామాయణాలు రాసారు.. సత్యసాయి వారు భక్తుడు మాట్లాడక ముందే అతను అడగాలని అనుకున్న ప్రశ్నలన్నిటికీ చక చకా సమాధానం చెప్తూ సాగిపోయ్యేవారు. అట్లే షిర్డీ బాబా తన వద్దకి వచ్చిన భక్తుల స్వంత విషయాలు భక్తుడు నోరు విప్పకుండానే చెప్పేవారు. దూర దర్శన సిద్ధి కలిగినవాడు మనో నేత్రం తో తాను అనుకున్న ప్రదేశములను, మనుషులను అట్లే సంఘటనలను చాల స్పష్టంగా చూడగలడు. ఈ సిద్ధి కలిగిన పారాశర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే 9 గ్రహాలు ఉన్నాయని అవి పనిచేసే తీరు ఎలా ఉంటుందో కూడా పరాశర సంహిత ద్వారా జ్యోతిష్య శాస్త్రమును రచించి ప్రజలకు అందించాడు.అంతకు పూర్వం కూడా నారద , జైమిని వంటి వారు అట్లే దర్శించి జ్యోతిష్య ఫలితాలు రచించారు . తరువాతి కాలం లో కలికాలపు scientist లకు అట్టి శక్తులు లేవు కాబట్టి వందల కోట్ల డాలర్లు వెచ్చించి టెలీస్కోపుల ద్వారా చూచి ఆ 9 గ్రహాల పేర్లే చెప్పారు. కలి మానవుడి శక్తి సన్నగిల్లిపోయిన కారణంగా మంత్రం తో చెయ్యలేనివి యంత్రం తో చెయ్యడానికి నా నా తంటాలు పడుతున్నాడు కానీ యోగ శక్తి తో సమానమైన శక్తి ని కనుక్కోవడం సాధ్యమా ..!!.? ... ఇక రోగాలు నయం చెయ్యడంలో షిర్డీ సాయి సత్యసాయి లు పెట్టింది పేరు. ఇక మన పురాణ కధలల్లో జంతువులతో సంభాషణ ఎన్నో చోట్ల ఉన్నది .రావణుని తో జటాయు సంభాషణ, అట్లే హనుమతో సంపాతి సంభాషణలే ఉదాహరణలు.
          6.   ప్రాకామ్య సిద్ధి :నీటిలో నివాసము చేసి , కావాలనుకున్నప్పుడు మరల భూమి పైకి రావుట , పరుల శరీరం లో కి వెళ్ళుట:
దుర్యోధనుడు నీటిలో కి వెళ్ళి తపమాచరించినట్లు మనకు మహాభారతం లో చెప్తారు. త్రిలింగ స్వామి నీటి లో ఆరు నెలలు వసించాడని యోగులు, పెద్దలు చెప్తారు. శ్రీ ఆదిశంకరులు రాజా అమరుక దేహం లోనికి పరకాయ ప్రవేశం చేసినట్లు శంకరుల జీవిత చరిత్రలో స్పష్టంగా ఉన్నది.
          7.   వశిత్వ సిద్ధి : సర్వ జనులు వశీకరణం చెందటం ఇందులో విశేషం.
ఈ సిద్ధి పొందిన గురువుల ఆధీనములో సర్వ దేశ ప్రజలు , రాజులూ ఉంటారు. ఎవరెన్ని ఉపాయాలు చేసినా వీరిని అనుసరిచే శిష్య బృందం పెరుగుతూనే ఉంటుంది . వీరు నమ్మిన ప్రతి భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటారు. ఈ సిద్ధి విశేషంగా ఒక జీవిత కాలం లో ప్రదర్శన చేసిన వారు శ్రీ కృష్ణ పరమాత్మ,సత్యసాయి . దాదాపు ప్రపంచ రాజులంతా అతన్ని భగవంతుని గ అవతారం చాలించక ముందే అనుభవించి ఒప్పుకున్నారు..ఒప్పుకొక ఎదురు తిరిగిన వారు చాలా తక్కువ ,అట్లు ఒప్పుకోక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన శిశుపాలుడు వంటి వారు చంపబడ్డారు , అట్లే సత్యసాయి దర్శనానికి ఒక్కోరోజు 14 నుండి 15 దేశాల అధినేతలు ఆశిస్సుల కోసం వచ్చేవారు , ప్రతీ భారత దేశ ప్రధాని మరియు రాష్ట్రపతి సత్యసాయి ని మానవాతీత శక్తి గా పరిగణించి పుట్టపర్తి వెళ్ళి ఆశీస్సులు పొందుట మనకి తెలుసు. అట్లే 155 దేశములల్లో సత్యసాయి భక్తులు దేవాలయాలు కట్టుకుని ప్రార్ధిస్తున్నారు , అతనితో పాటు రాముడు , కృష్ణుడిని కుడా వారు పూజిస్తూ ఉన్నారు.
వశిత్వ సిద్ధిలో క్రూర జంతువులు సైతం వశమైపోతవి , అరణ్యములల్లో సాధన చేసేవారు ఈ సిద్ధి పొంది క్రూర జంతువుల వలన ఏ భయమూ లేక తపమాచరించేవారు .
          8.   ఈశిత్వసిద్ధి: పూర్తిగా మహేశ్వర తత్వాన్ని ప్రదర్శన చెయ్యడం , జగత్తులో సర్వం ఈ సిద్ధి ద్వారా వశమైపోవును . విశ్వానికి ప్రభువుగా తన శక్తి ప్రదర్శన జరుగును.
చనిపోయిన వారిని బ్రతికించ కలగడం ఈ సిద్ధి పొందిన వారిలో ప్రత్యేకం.
సత్యసాయి కరణం సుబ్బమ్మ ను మరణించిన మూడవ రోజు లేపి తులసి తీర్ధమిచ్చిమరల పరలోక ప్రయాణం చేయించడం వందల మంది సమక్షం లో బుక్కపట్టణం లో జరిగింది. అట్లే నృశింహ సరస్వతుల వారు మరణించిన భర్తను పట్టుకు వచ్చిన స్త్రీని సుమంగళి గా ఉండమని దీవించి ఆ మరణించిన వ్యక్తిని లేపాడు.. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు ఆ దంపతులు హాయిగా జీవనం చేసారు.
          9.   స్వర్ణ సిద్ధి : బంగారమును సృష్టించడం
సత్యసాయి తమ అవతార సమయం లో దాదాపు ప్రతి రోజు ఇట్టి సిద్ధిని ప్రదర్శించారు . అట్లే మౌన స్వామి కుర్తాళం లో అనేక సార్లు ఈ మహిమ చేసి చుపారు.
          10.   కామ రూప సిద్ధి
తను సంకల్పించిన శరీర రూపమును పొందుట , హనుమంతుడు ఈ సిద్ధి ని ఉపయోగ పెట్టి ఒక విప్రుని రూపం లో వెళ్ళి సుగ్రీవుని ఆజ్ఞ పై రాముల వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు .
          11.   యతః సంకల్ప సిద్ధి
ఇష్ట వస్తువుని సంకల్ప మాత్రముగా పొందుట
          12.   భూత జయ సిద్ధి
పంచభూతముల పై ఆధిపత్యము సాధించుట. గాలి , నీరు , నిప్పు వంటి పంచభూతముల ప్రవర్తనను సంకల్ప మాత్రమున నియంత్రించుట లేక సృస్టించుట

praveen sarma

Friday, February 26, 2016

నమో శ్రీ వెంకటేశ



అల్లనల్లన అమృతంపు జల్లు చల్లు
చల్ల చల్లని దివ్య హస్తములు నీవి
ఆ కరమ్ములు శుభముల కాకరములు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశ్వరా! మెల్ల మెల్ల గా అమృతంపు జల్లు ను చిలకరించెడి దివ్య హస్తములు నీవి. ఆ నీ దివ్య హస్తములు సర్వ శుభములకు నిలయములు కదా ప్రభూ !. సర్వ శుభములకు నీ దివ్య ఆశీస్సులే కారణములు.
మంద మారుత సంస్పర్శలందు కరగి
కమ్మతేనెలు చిందు నెత్తమ్మి లీల
తన్మయంబగు నీ స్మృతిన్ మన్మనంబు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీనివాసా ! హే జగన్నివాసా! మలయ మారుతములతో పులకించి, కమ్మని తేనెలను చిందించు తామరపువ్వు వలె నా మనస్సు నీ స్మరణ తోనే పులకించి పోతోంది ప్రభూ !
( Ravi Prasad Muttevi గారు వ్రాసిన గీతాలు )

సూర్యనారాయణ


సూర్యుని ఎందుకు ఆరాధించాలి.🍀🌻🍀
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. -ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. -వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి. -సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.
🌹👏 సూర్యనారాయణ మహదేవ దేవ నమస్తే నమస్తే నమస్తే నమ:.🌹👏

దశ దానాలు


ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే దానం అనేది ఉన్నవాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మనం ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పదేవిధముగాను అవస్యముగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి
దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..
గోదానం
గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదానం
తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దానం
హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం
ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదానం
శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయండి .

Thursday, February 25, 2016

కోణార్క్ సూర్యదేవాలయం



కోణార్క్ సూర్యదేవాలయం-అద్భుతాలకు నిలయం...
భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం::
ఈ క్షేత్రం చంద్రభాగా నది తీరాన ఉంది...
ఈ దేవాలయాన్ని మేగ్నటైట్(సూదంటురాయి) లాంటి రాళ్ళతో నిర్మించారు...
అవన్నీ ఒక క్రమ పద్దతిలో ఒక దాని మీదుగా అమర్చటం వలన సూర్యదేవుని
విగ్రహం గాలిలో తేలి ఉండి, వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది...
ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖ ద్వారం కూడా ఎంతో విలువైనది..
ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఎంత శక్తివంతమైనవంటే
ఆ ఆలయం దగ్గరలో తిరిగే హెలికాప్టర్ లను సైతం ఆకర్షించగలిగేంత అట...
దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల
నిమిత్తం ఇంగ్లాండుకు తీసుకుని పోయారని ఒక కథనం..
ఈ క్షేత్రంలోసూర్యభగవానుడు ఇరవైనాలుగు చక్రాల తో,
ఏడు అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా
ఉంటుంది.... ఆ ఇరవైనాలుగు చక్రలు ఒక
రోజులోని గంటలకు సూచన...
ఏడు గుర్రాలు ఏడు రోజులకు సూచన... ఈ
అశ్వాలు చాలా రౌద్రంగా భయానకంగా కనపడి
చూపరులను భయ పడే విధంగా ఉంటాయట
(ప్రస్తుతం శిధిలమైనాయి).. ఏనుగులు నిజంగా
ఉన్నాయేమొనని అనిపించేంత ఉంటాయట...
ఈ ఆలయ కుడ్యాల మీద రసరమ్య శిల్పాలు,
నాట్యభంగిమలు ... ఇవి మాటలకందని అద్భుతాలని
చెప్పవచ్చు.. ఈ ఆలయం కట్టడానికి
పదహారు సంవత్సరాలు పట్టిందట... దీనికై
దాదాపు పన్నెండు వందల మంది
శిల్పకారులు పనిచేసారట.. ఎంతకీ ఈ ఆలయ గోపురాన్ని
వాటి మధ్య సూర్యభగవానుడు తేలే విధంగా
చేయడం వారికి సాధ్యమవలేదట... రేపటి రోజులోపులో ఈ
గుడి నిర్మాణం పూర్తి కావాలి లేదా అందరికీ శిరచ్చేదమే
అని రాజు ఉత్తర్వులు జారీ చేసి వెళ్ళి పోతారట..
సాయంత్రం దాకా ఏమీ తేలలేదు తెల్లారితే శిరచ్చేదమే
అని బాధతో నిశ్క్రమిస్తారట... అయితే అందులో ఒక శిల్పి
తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పనిలో చేరతాడి..
ఆశిల్ప శిల్పకారుడి కుమారుడి పదహారవ ఏడున ..
తన తండ్రి ని చూడాలని వచ్చి ఆ రాత్రి వారి
సమస్యను చూసి వెంటనే ఆ రాత్రే పరిష్కరించి ...
ఆలయ శిఖరాన్ని పూర్తిచేసి వారందరిని ఆశ్చర్య
చకితులను చేస్తారట...అయితే అంతటి
మహత్కార్యాన్ని పూర్తిచేసిన అతన్ని చూసి మిగిలిన
వారిని రాజు చంపేస్తాడనే భయంతో ఆ
కుర్రవాడు చంద్రభాగా నదిలో ఆత్మహత్య
చేసుకున్నాడని ఒక కథనం... ఆ కుర్రవాడు భారత
నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం... కానీ ఈ ఘటన ఈ
ఆలయానికి ఒక శాపమైందనే కథనం కూడా ఉంది... ఈ
ఆలయం చాలా సార్లు ముష్కరుల దండ
యాత్రకు ... ఆంగ్లేయుల దాష్టికానికి గురై ... తన
వైభవాన్ని దాదాపు కోల్పోయి
ప్రస్తుతం కొంచెం కొంచెంగా
వెలుగొందుతోంది... జీవిత కాలంలో ఒక్కసారిఅయినా
చూడతగిన క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం...

మానస సరోవరం



మానస సరోవరం 

సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది.

కల్పవృక్షం ఇక్కడే ఉంటుందని కుబేరుడి నివాసం కూడా ఇక్కడే అని విష్ణుపాదోద్భవ గంగ కైలాసశిఖిరికి చేరి దానిని ప్రదక్షించి అక్కడి నుంచి నాలుగు నదులుగా మారి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్మలి నదుల పుట్టుక ఇక్కడే. మానససరోవరంలో మునిగి కైలాసపరిక్రమ చేసినవారికి జన్మరాహిత్యమే అంటారు. శివునిలో లీనమై తామే శివస్వరూపులైపోతారని చెబుతారు. కల్పవృక్షం ఇక్కడే, గంగ భూమిని చేరింది ఇక్కడే ఇటువంటి కైలాస మానస సరోవరం దర్శనం అనేక జన్మల పుణ్యం.

ఒక్కోసారి భయాందోళనలతో ఒడలు జలదరింప చేసే అనుభవాలూ, భక్తిపారవశ్యంతో తనువు పులకరింప జేసే దివ్య అనుభూతుల సమ్మేళనం కైలాస మానస సరోవరయాత్ర ఒక వింత అద్భుతం. ఆధ్యాత్మికతలను అందించే ఒక అద్భుత యాత్ర.

కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితః ప్రభో
అగస్త్యదేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖరః

కళ్ళు మూసుకుని శ్లోకాన్ని అంటూ ఉండగా, కైలాస పరవతాన్ని కళ్ళల్లో ఊహించుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి అదిగో 'కైలాస్' అనడం, మేము కారు దిగిపోవడం ఒక్కసారిగా జరిగాయి. ఎదురుగా అల్లంత దూరాన మౌంట్ కైలాస్ శిఖరం తెల్లగా వెండిపర్వతంలా మెరిసిపోతూ కనిపించింది. 'ఎన్ని జన్మల పుణ్యమో కదా ! పరమేశ్వరా! ఎప్పటి నుంచో వస్తున్న పాపాలు....నీ దర్శన భాగ్యంతో హరించుకుపోతాయి. ఈ అల్పజీవి మీద నీకు ఇంత కరుణ ఎందుకు స్వామి!"

దేవతల అర్ధరాత్రి స్నానాలు ..!

మానససరోవరంలో ప్రతిరోజు అర్దరాత్రి దేవతలు వచ్చి స్నానం చేసి కైలాసంలోని ఈశ్వరున్ని దర్శిస్తారు అని కళ్లకు నక్షత్రరూపంలో మాత్రమే కనిపిస్తారని అంటారు. ఈ సరోవరంలో హంసలు ఉంటాయని అదెంతమాత్రం నిజమో, కాని హంసల్లాంటి పక్షులు ఉన్నాయి. మానససరోవరానికి ఇంకోవైపు రాక్షసతాల్ అనే ఒక సరోవరం ఉంది. ఇక్కడ రాక్షసులు స్నానం చేస్తారని మరెవ్వరూ స్నానం చెయ్యరు అని దీని మధ్యలో చిన్న రాతిగుట్ట మీద రావణాసురుడు శివుని కోసం తపస్సు చేశాడని, కైలాసపర్వతం ఎత్తబోయాడని అంటారు.
మానసరోవరం అనేది చైనా కు చెందిన టిబెట్ ప్రాంతంలో గల మంచినీటి సరస్సు,
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో భారత దేశం, టిబెట్, నేపాల్ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన హంసలు మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరం గా చెపుతారు.

ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్చమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక. స్వచ్చమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మానస సరోవర పరిధి దాదాపు 90కి,మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి అధారం మానససరోవర జలం. ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం. వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.

చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్ధం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండీ ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము. 1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండీ 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండీ కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మానసిక సంకల్పంతో పాటు శారీరకం గా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండీ ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి. సముద్ర మట్టం నుండీ 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణం లో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్తితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి.

"సంకట హర చతుర్ది"


సుద్ధ చవితి రోజున ఉదయం పూత పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం పోదున పూజ చేసిన చద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి .
సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు , అ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి . రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యానం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచితంగా తిధి సమయం చూసుకోవాలి.

ధర్మ సింధు లాంటి గ్రంధాలో మనకి చేపెటువంటి విషయం ఏంటి అంటే "తదియతో కలిసిన చవితి " చెయాలి తప్ప పంచమి తో కలిసిన చవితి చేయకూడదు. ఇలా చేయటం వలన సంకటాలు అని తొలిగి పోవు. తిధి నిర్ణయం తప్పు జరుగుతుంది . శాస్త్ర ప్రకారం చవితి చేయడం లేదు .

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.


సంకష్ట హర చతుర్థి: 
సంకష్ట హర చతుర్ధి లేక సంకష్ట చతుర్ధి లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి అనేది ప్రతి మాసం కృష్ణ పక్షంలో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.

ప్రాముఖ్యత: 
అసలు ఈ సంకట చతుర్ధి ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట అంటే కష్టములు లేక ఇబ్బందులు... సమస్యలు హర అంటే హరించటం...రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు. అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.
విమానయానం: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

పాప దృష్టి: 
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

పాపాత్మురాలు: 
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు.

వ్రత ఫలితం: 
ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గానీ స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అప్పుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. 

ఏడు జన్మల మోక్షం 
హిందువులలో ఉన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్త్రీ/ పురుషులలో మోక్షం పొందటానికి ముందు 7 జన్మలు ఎత్తుతారు. ఆ ఏడు జన్మల అనంతరం మోక్షం పొందుతారు. కానీ ఎవరైతే సంకష్టహర చవితి చేస్తారో వారు గణేష లోకానికి వెడతారు. వారికిక పునర్జన్మ అనేది ఉండదు. 
వ్రత ఫలితం: ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకునికి పూజ చేయాలి. పూజలో కూడా సంకట నాశన గణేశ స్తోత్రమ్‌ ప్రత్యేకంగా 3సార్లు పఠించాలి. ఎవరెవరు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో అవి అన్నీ తీరుతాయి. విద్యార్ధులకు విద్య, సంతానార్థులకు సంతానం, ధనాన్ని కాంక్షించే వారికి ధనం.. ఇలా ఎవరెవరికి కావలసిన విధంగా వారు మనసారా వినాయకుని పూజించి, వేడుకొని వినాయకునికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం దక్షిణ భారతీయులే కాక ఉత్తర భారతీయులు కూడా అమితంగా పాటిస్తారు.

షోడశోపచార పూజ: 
ఎవరైనా పెద్దవారు మనింటికి వస్తే ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ఎలా మర్యాదలు చేస్తామో, అదే రకంగా మన ఇష్టదైవాన్ని 16 రకాల ఉపచారాలు చేసి సేవించటమే షోడశోపచార పూజా విధానం. ఇది మన సత్సంప్రదాయం.

1. ఆవాహనం - వారిని మన ఇంటిలోకి మనస్ఫూర్తిగా రమ్మని ఆహ్వానించుట.
2. అర్ఘ్యం - కాళ్ళు, చేతులు కడుగుకోవటానికి నీళ్ళని వినయంగా అందించుట
3. పాద్యం- 
4. ఆసనం - వచ్చిన పెద్దలు కూర్చోవటానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయుట
5. ఆచమనీయం - మంచినీళ్ళు (దాహం) ఇవ్వడం
6. స్నానం- వారి ప్రయాణ అలసట తొలగేందుకు స్నానం వగైరా ఏర్పాట్లు
7. వస్త్రం - స్నానానంతరం ధరించేందుకు మడి లేక పొడి బట్టలు ఇవ్వడం
8. యజ్ఞోపవీతం- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9. గంధం - శరీరానికి సుగంధం, చల్లదనానికి గంధాన్నివ్వడం
10. పుష్పం - సుగంధాన్ని ఆస్వాదించేలా అలంకరణకి
11. ధూపం - సుగంధ వాతావరణం కల్పించటానికి
12.. దీపం - వెలుతురు కోసం, చీకటిలో ఉండకూడదు కనుక అనుకూలతకై
13. నైవేద్యం - తన తాహతు రీత్యా, తనకి అనుకున్న దానిని ముందుగా ఆ దైవానికి సమర్పించటం 
14. తాంబూలం- ముఖ సుగంధార్ధంగా, భుక్త పదార్ధాలలోని లోపాలు తొలగింపునకు
15. నమస్కారం - మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించమని కోరడం
16. ప్రదక్షణం - ఆ దైవం యొక్క గొప్పతనాన్ని త్రికరణ శుద్ధిగా అంగీకరించటం. 

ఏది ఏమైనా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో నాలుగవ రోజైన ఈ చవితికి అత్యంత మహిమగల చవితిగా పేరున్నందున వినాయకుని సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆనాడు ఉపవాసం రాత్రి వరకూ ఉండి తర్పక్రియుడైన వినాయకునికి ఆయనకి ప్రియమైన వస్తువులతో పూజ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఆ లంబోదరుడు మనల్ని దాటిస్తాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి కాక సంవత్సరంలో నెలనెలా వచ్చే ఈ సంకష్ట చతుర్ధిని కూడా ఆప్యాయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా దూరం అవుతాయన్నది అతిశయోక్తి కాదు. విద్య, ధనం, సంతానం, మోక్షం అన్నిటికీ కూడా ఆయన్ని పూజించి వేడుకుంటే నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది.



శ్రీ లక్ష్మీ స్తోత్రమ్


సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

విదురనీతి





దృతరాష్ట్రుడు " నిద్ర పట్టటం లేదు ఎమైనా మంచి వాక్యాలు చెప్పు" అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంప్దకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది. తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.
విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు " విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు. పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మద్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోస్త హిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది " అన్నాడు. విదురుడు " రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా! ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను " అన్నాడు.విద్రుడు " ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకో " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.

Wednesday, February 24, 2016

మంచి ఆరోగ్యానికి రాగులు..!



రాగులు బలవర్దకమయిన ధాన్యం. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో,  మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు. ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!
1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

Tuesday, February 23, 2016

గోమతిచక్రాలు.....




గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి..ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం.ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి,ప్రేమ,దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.
గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే "నాగ చక్రం" అని "విష్ణు చక్రం" అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని "నత్త గుళ్ళ "స్టోన్ అని కూడ అంటారు.గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది.గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను,కొన్ని ఎర్ర గాను ఉంటాయి.తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.
పూజా విధానం:-
గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుంతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి.గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు.పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని,హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి.గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.
ఉపయోగాలు:-
1)ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది.బాలారిష్ట దోషాలు కూడ పోతాయి .
2)రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.
3)మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ,కమ్యూనికేషన్,సహాకారం లభిస్తుంది.మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
4)నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు.నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.
5)ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది.ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.
6)ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.శత్రువులపై విజయం సాదించవచ్చును.కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.
7)ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయబేదాలు మటుమాయం అవుతాయి.
8)ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.
9)తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.
10)పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.
11)పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.
12)13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.
13)27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.
14) జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.దీనినే నాగదోషం అంటారు.జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని,దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి................( From samskruthi - sampradhaayaalu )

ఋణ విమోచన గణేశ స్తోత్రం


ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||
స్తోత్రం
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||
హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||
పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||
ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||
శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||
లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||
ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

జీవిత సత్యాలు -6


జీవిత సత్యాలు -5


జీవిత సత్యాలు -4


జీవిత సత్యాలు -3


జీవిత సత్యాలు - 2


జీవిత సత్యాలు - 1


జీవిత సత్యాలు


Monday, February 22, 2016

మహా మాఘి( మాఘ పౌర్ణమి ) శుభాకాంక్షలు


మహా మాఘి ........... మాఘ పౌర్ణమిచాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చిం.
''అకార్తీక మాసం దీపానికెంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో స్నానానికంత ప్రాశస్త్యం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయమంటారు. ఈమాసంగురించి పద్మపురాణంలో వివరంగా ఉంది.
మాఘస్నానం చిరాయువు, సంపద, ఆరోగ్యం, సౌజన్యం, సౌశీల్యం, సత్సంతానం కలగచేస్తుంది. 'తిల తైలేన దీప శ్చయా: శివగృహే శుభా:' అని శివ పురాణం పేర్కొంది. దీన్నిబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ఇది పదకొండో మాసం. గృహనిర్మాణాలు ప్రారంభిస్తే మంచిది. ఈ మాసంలో ఆదివారాలు విశేషమైనవి. ఆదివారాల్లో స్నానా నంతరం సూర్యుడికి అర్ఘ్యమివ్వడంతో పాటు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివార వ్రతం చేయడం మంచిది. ఆదివారాలు తరిగిన కూరగాయలు తినకూడదంటారు.
తెలుగునాట మాఘపాదివారాల్లో స్త్రీలు నోము నోచుకుంటారు. ఈ నెల్లో వచ్చే నాలుగాదివారాలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి సూర్యోదయ సమయానికి సూర్యారాధన చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
యజ్ఞంలో అశ్వమేధం, పర్వతాల్లో హిమాలయం,వ్రతాల్లో సత్యనారా యణస్వామి వ్రతం, దానాల్లో అభయదానం, మంత్రాల్లో ప్రణవం, ధర్మాల్లో అహింస, విద్యల్లో బ్రహ్మవిద్య, ఛందస్సులో గాయత్రీ, ఆవుల్లో కామధేనువు, వృక్షాల్లో కల్పతరువు ఎంతగొప్పవో స్నానాల్లో మాఘ స్నానం అంత మహిమాన్వితమైంది. సూర్యుడు మకరరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఆనాటి నుంచి ప్రాత:స్నానం తప్పక చేయాలి. నదులు, చెరువులు, సముద్రతీరాలదగ్గర లేదా బావివద్దా స్నానంచేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పద్మ పురాణం స్పష్టం చేస్తోంది.
ప్రతిరోజూ పర్వదినమే: ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనవే. శుద్ధ విదియ త్యాగరాజస్వామి ఆరాధన చేస్తే, తదియనాడు ఉమాపూజ, లలితా వత్రం చేయాలంటుంది చతుర్వర్గ చింతామణి. చవితిరోజు ఉమాదేవిని, గణపతిని పూజించాలంటారు. ఇక పంచమిని శ్రీపంచమనీ, మదన పంచ మని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది సరస్వతీదేవి జన్మదినం. సర్వత్రా చదువుల తల్లిని, రతీ మన్మధుల్ని పూజిస్తారు. ఈ రోజున వసంతోత్సవ ఆరంభం అనీ, పంచాంగ కర్తలు వసంత పంచమిని ఉదహరిస్తారు. షష్ఠి రోజున మందార షష్ఠి, వరుణ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.
ఇక మాఘశుద్ధ సప్తమే 'రథసప్తమి'గా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుని పూజించాలి. అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్ముడిని పూజించటం సత్ఫలితాలనిస్తుంది. నవమిని మహానంద నవమి అని, స్మృతి కౌస్త్తుభం, నందినీదేవి పూజ చేయాలని చతుర్వర్గచింతామణి చెబుతుంది. ఇక ఏకాదశినాడే పుష్యవంతుడనే గంధర్వుడు ఉపవసించి శాపవిముక్తయ్యాడు. ఈనాడే గోదావరి సాగరసంగమమైన అంతర్వేదిలో శ్రీమహాలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
భీముడు ఏకాదశీవ్రతం చేసి, కౌరవులను జయించిందీ రోజే. శుద్ధ ద్వాదశినాడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువునీ భక్తి ప్రపత్తులతో అర్చిస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా పాటిస్తారు. విశ్వకర్మ దేవశిల్పి కావటంతో మహాపురుషుడిగా భావిస్తారు. మాఘ పౌర్ణమి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది. దీన్ని 'మహామాఘి' అని కూడా పిలుస్తారు.
బహుళ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. ఇక శ్రీరాముడు రావణ సంహారంకోసం లంకవెళ్ళేందుకు సేతునిర్మాణం బహుళ ఏకాదశి నాడే పూర్తి అయిందంటారు. ద్వాదశి ముందురోజు ఉపవాసముండి ద్వాదశినాడు నువ్వులు దానమిచ్చి, తలస్నానం చెయ్యాలంటారు. అందుకే దీన్ని తిలద్వాదశీ వ్రతం ఆచరిస్తారు.
ధర్మశాస్త్ర పురాణ తిహాసాలు నేర్చుకునేందుకు త్రయోదశి మంచిరోజని చెబుతారు. బహుళ చతుర్దశి మహాశివరాత్రి. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ శుభదినం. ఈనాడు భక్తిశ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతతో మహాశివుణ్ని ఎవరైతే స్మరిస్తారో వారికా పరమేశ్వరుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాంటారు. ఉపవాసం, జాగరణకు ప్రశస్తమైన రోజిది. అమావాస్య స్వర్గస్తులైన పితరులకు తర్పణం వదిలే రోజు.
అత్యంత మహమాన్వితమైన మాఘమాసం నెలరోజులూ క్రమం తప్పకుండా స్నానదానాదులను నిర్వహించడం వల్ల సకల పాపాలు, సర్వ రోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా జయం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడికి అభిషేకంచేసి, అర్చించి శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే దీర్ఘాయుష్షుతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
కాబట్టి ప్రతివారూ ఈ మాసంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నిద్దాం.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ

Sunday, February 21, 2016

యజ్ఞ ధూమం

యజ్ఞ ధూమం వలన వాయు పరిశుద్ధతయే కాకుండ అక్కడ ఉన్న స్థలము,పృధ్వి ,జలము అన్నీ పరిశుద్ధ మవుతాయి . అంతే కాక మానవశరీరం లో రోగనిరోధక అణువుల పెరుగుదల ఉంటుంది అందువలన అతని ఆరోగ్యము బాగుపడుతుంది. యజ్ఞధూమం యొక్క సాత్విక లక్షణాలు మేఘంలో జొరబడి వర్షించి భూమి మీద ఉన్న అన్నంలో సత్వగుణ పరిమాణాన్ని పెంచుతాయి

Saturday, February 20, 2016

శివధ్యానము

శివధ్యానము

ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహదేవాయ,
 త్ర్యంబకాయ,త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ,
కాలాగ్నిరుద్రాయ, నీలాకంఠాయ, మృత్యుంజయాయ,
సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః

దేవుడికి కర్పూర హారతి ఇవ్వడంలోని పరమార్ధం .......

పూర్వం దేవాలయాల్లోని గర్భాలయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ వుండేది. అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం ... అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు. హారతిని మూలమూర్తికి దగ్గరగా ... ఎదురుగా వుంచి మూడుమార్లు శిరస్సు నుంచి పాదాల వరకూ గుండ్రంగా తిప్పడంలోని ఉద్దేశం ఇదే.

హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు, ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తరిస్తుంటారు. ఇక కర్పూరానికి రూపం ... రంగు ... గుణం ... వంటివి వున్నాయి. అది ఆ రూపాన్ని ... రంగుని ... గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది. భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటిచెబుతోంది.

అంతేకాదు కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఏన్నో ఉన్నవి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

విశ్వనాధష్టకం


గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయనః ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||

ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.