Thursday, February 25, 2016

"సంకట హర చతుర్ది"


సుద్ధ చవితి రోజున ఉదయం పూత పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం పోదున పూజ చేసిన చద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి .
సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు , అ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి . రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యానం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచితంగా తిధి సమయం చూసుకోవాలి.

ధర్మ సింధు లాంటి గ్రంధాలో మనకి చేపెటువంటి విషయం ఏంటి అంటే "తదియతో కలిసిన చవితి " చెయాలి తప్ప పంచమి తో కలిసిన చవితి చేయకూడదు. ఇలా చేయటం వలన సంకటాలు అని తొలిగి పోవు. తిధి నిర్ణయం తప్పు జరుగుతుంది . శాస్త్ర ప్రకారం చవితి చేయడం లేదు .

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.


సంకష్ట హర చతుర్థి: 
సంకష్ట హర చతుర్ధి లేక సంకష్ట చతుర్ధి లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి అనేది ప్రతి మాసం కృష్ణ పక్షంలో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.

ప్రాముఖ్యత: 
అసలు ఈ సంకట చతుర్ధి ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట అంటే కష్టములు లేక ఇబ్బందులు... సమస్యలు హర అంటే హరించటం...రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు. అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.
విమానయానం: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

పాప దృష్టి: 
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

పాపాత్మురాలు: 
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు.

వ్రత ఫలితం: 
ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గానీ స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అప్పుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. 

ఏడు జన్మల మోక్షం 
హిందువులలో ఉన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్త్రీ/ పురుషులలో మోక్షం పొందటానికి ముందు 7 జన్మలు ఎత్తుతారు. ఆ ఏడు జన్మల అనంతరం మోక్షం పొందుతారు. కానీ ఎవరైతే సంకష్టహర చవితి చేస్తారో వారు గణేష లోకానికి వెడతారు. వారికిక పునర్జన్మ అనేది ఉండదు. 
వ్రత ఫలితం: ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకునికి పూజ చేయాలి. పూజలో కూడా సంకట నాశన గణేశ స్తోత్రమ్‌ ప్రత్యేకంగా 3సార్లు పఠించాలి. ఎవరెవరు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో అవి అన్నీ తీరుతాయి. విద్యార్ధులకు విద్య, సంతానార్థులకు సంతానం, ధనాన్ని కాంక్షించే వారికి ధనం.. ఇలా ఎవరెవరికి కావలసిన విధంగా వారు మనసారా వినాయకుని పూజించి, వేడుకొని వినాయకునికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం దక్షిణ భారతీయులే కాక ఉత్తర భారతీయులు కూడా అమితంగా పాటిస్తారు.

షోడశోపచార పూజ: 
ఎవరైనా పెద్దవారు మనింటికి వస్తే ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ఎలా మర్యాదలు చేస్తామో, అదే రకంగా మన ఇష్టదైవాన్ని 16 రకాల ఉపచారాలు చేసి సేవించటమే షోడశోపచార పూజా విధానం. ఇది మన సత్సంప్రదాయం.

1. ఆవాహనం - వారిని మన ఇంటిలోకి మనస్ఫూర్తిగా రమ్మని ఆహ్వానించుట.
2. అర్ఘ్యం - కాళ్ళు, చేతులు కడుగుకోవటానికి నీళ్ళని వినయంగా అందించుట
3. పాద్యం- 
4. ఆసనం - వచ్చిన పెద్దలు కూర్చోవటానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయుట
5. ఆచమనీయం - మంచినీళ్ళు (దాహం) ఇవ్వడం
6. స్నానం- వారి ప్రయాణ అలసట తొలగేందుకు స్నానం వగైరా ఏర్పాట్లు
7. వస్త్రం - స్నానానంతరం ధరించేందుకు మడి లేక పొడి బట్టలు ఇవ్వడం
8. యజ్ఞోపవీతం- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9. గంధం - శరీరానికి సుగంధం, చల్లదనానికి గంధాన్నివ్వడం
10. పుష్పం - సుగంధాన్ని ఆస్వాదించేలా అలంకరణకి
11. ధూపం - సుగంధ వాతావరణం కల్పించటానికి
12.. దీపం - వెలుతురు కోసం, చీకటిలో ఉండకూడదు కనుక అనుకూలతకై
13. నైవేద్యం - తన తాహతు రీత్యా, తనకి అనుకున్న దానిని ముందుగా ఆ దైవానికి సమర్పించటం 
14. తాంబూలం- ముఖ సుగంధార్ధంగా, భుక్త పదార్ధాలలోని లోపాలు తొలగింపునకు
15. నమస్కారం - మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించమని కోరడం
16. ప్రదక్షణం - ఆ దైవం యొక్క గొప్పతనాన్ని త్రికరణ శుద్ధిగా అంగీకరించటం. 

ఏది ఏమైనా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో నాలుగవ రోజైన ఈ చవితికి అత్యంత మహిమగల చవితిగా పేరున్నందున వినాయకుని సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆనాడు ఉపవాసం రాత్రి వరకూ ఉండి తర్పక్రియుడైన వినాయకునికి ఆయనకి ప్రియమైన వస్తువులతో పూజ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఆ లంబోదరుడు మనల్ని దాటిస్తాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి కాక సంవత్సరంలో నెలనెలా వచ్చే ఈ సంకష్ట చతుర్ధిని కూడా ఆప్యాయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా దూరం అవుతాయన్నది అతిశయోక్తి కాదు. విద్య, ధనం, సంతానం, మోక్షం అన్నిటికీ కూడా ఆయన్ని పూజించి వేడుకుంటే నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది.



No comments:

Post a Comment