దాల్చిన చెక్క వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు...
1
దాల్చిన చెక్క
ఇది పురాతన కాలం నుండి వాడుతున్న మసాలా రకమని అందరికి తెలిసిందే. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన వల్కమును ఎండబెట్టి, దాల్చిన చెక్క కట్టలా చుడతారు, ఇవి సుగంధ వాసనను వెలువరుస్తాయి. వీటిని ఎక్కువగా మన వంటకాలలో ఉపయోగిస్తాము, అంతే కాకుండా వీటి వలన ఆరోగ్యానికి ప్రయోజనలను కలుగచేస్తుంది
2
జలుబు మరియు దగ్గు
దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్క స్టిక్'తో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. దాల్చిన చెక్క ఎక్కువగా 'యాంటీ-బాక్టీరియల్' గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి, వ్యాధి గ్రస్త కారకాలకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తుంది.
3
కీళ్ళ నొప్పులు
దాల్చిన చేక్కతో చేసిన టీ తాగటం వల్ల, కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన మసాజ్ ఆయిల్'ను వాడటం వల్ల కూడా కీళ్ళ నోప్పులు తగ్గుతాయని కొందరు దృడంగా నమ్ముతున్నారు.
4
చర్మ రక్షణ
దాల్చిన చెక్క ఒక భిన్నమైన మసాలా. ఇది యాంటీ-మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల చర్మ రక్షణకి ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క మరియు తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు మరియు మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది యాంటీ-సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయాలు మానటానికి మందుగా వాడతారు.
5
జీర్ణాశయ సమస్యలు
దాల్చిన చెక్కని, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతారు, మరియు ఇది జీర్ణాశయాన్ని దాని విధులకు అనుకువగా ఉంచుతుంది. పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల, కడుపులోని గ్యాస్'ను తొలగిస్తుంది
6
బరువు తగ్గటం
ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగే ఫాట్'ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు మరియు రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలి.
7
గుండెకి సంబంధిచిన వ్యాధులు
దాల్చిన చెక్క గుండెకి సంబంధించిన వ్యాధులు లేదా డయాబెటిస్ రావటంలో 23 శాతాన్ని తగ్గిస్తుందని 'Centre for Applied Health Sciences in Fairlawn' వాళ్ళు తెలిపారు. దాల్చిన చెక్క- నీరు మిశ్రమం యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆపుతుంది
8
కొవ్వు పదార్థాలు
దాల్చిన చెక్క మరియు తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్'ని తగ్గిస్తాయి. ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలోని చెడుకొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి
9
క్యాన్సర్
దాల్చిన చెక్క కాన్సర్ కారకాలతో అద్భుతంగా పోరాడి, వాటి వ్యాప్తిని తగ్గిస్తుంది. రోజు ఒక సగం చెంచా దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల, ముఖ్యంగా కాన్సర్ ప్రమాదం నుండి కాపాడుతుంది
10
పంటి చిగురు సమస్యలు
హానికర బాక్టీరియా వల్ల వచ్చే పంటి చిగురు సమస్యలలో కూడా దాల్చిన చెక్క సహాయపడుతుంది. దాల్చిన చెక్క ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. ఈ కారణం చేత దీన్ని చూఇంగ్ గమ్స్, మౌత్ వాషేస్, టూత్-జేల్స్ మరియు బ్రీత్-మింట్స్'ల తయారీలలో వాడుతున్నారు
11
పరిపక్వత
దాల్చిన చెక్క ‘సిన్నమాల్డిహైడ్’ వంటి సహజ సిద్ధమైన రసాయనాలను కలిగి ఉంటుంది. ఈ రసాయనాలు స్త్రీలలో 'ప్రోజేస్టిరాన్' ఉత్పత్తిని పెంచి, 'టెస్టోస్టిరాన్' ఉత్పత్తిని తగ్గించి శరీరంలో హార్మోన్ విడుదలను సమన్వయ పరచి, పరిపక్వతను తొందరగా అయ్యేలా చేస్తుంది
No comments:
Post a Comment