Friday, August 12, 2016

వైతరణి...

వైతరణి...ఇదో నది.. పేరులో ఉన్న గమ్మత్తు నధిలో ఉండదు. మనిషి మరణించిన అనంతరం చేసిన పపానుసారం నరకానికి వెళతారని గరుడ పురాణం సారంశం.ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని ఉంటాయి.సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.
గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.
హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట. 

తప్పు చేసినవారు వైతరణి దాటాల్సిందే..

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో

No comments:

Post a Comment