Friday, August 12, 2016

వైతరణి...

వైతరణి...ఇదో నది.. పేరులో ఉన్న గమ్మత్తు నధిలో ఉండదు. మనిషి మరణించిన అనంతరం చేసిన పపానుసారం నరకానికి వెళతారని గరుడ పురాణం సారంశం.ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళా వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని ఉంటాయి.సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.
గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.
హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట. 

తప్పు చేసినవారు వైతరణి దాటాల్సిందే..

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో

Thursday, August 11, 2016

సకల సంపదలనిచ్చే వరలక్షీ వ్రతం
చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చిన దేవి ఈ వ్రతాన్ని చేయాల్సిందిగా చెప్పినట్లు పురాణ కథనం. శ్రావణమాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేయడం ఆనవారుుతీగా వస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం చేస్తుంటారు. ఈ సందర్భంగా వ్రత విధానం, పూజా విధనం, వ్రత కథలపై సూర్య పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న కథనం...


షోడశోపచార పూజా ప్రారంభః
ప్రార్థన:
శ్లోపద్మాసనే పద్మకరే 
సర్వలోకైక పూజితే,
నారాయణప్రియే దేవీ
సుప్రీతీ భవ సర్వదా,

ధాన్యం: 
శ్లో క్షీరోదార్ణవసంభూతే 
కమలే కమలాలయే
సుస్థిరాభవ మే గేహె సురాసురనమస్కృతే.
శ్రీ వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి.


ఆవాహనం: సర్వ మంగళమాంగల్యే విష్టువక్షఃస్థలాలయే.
అవాహయామి దేవీ త్వాం 
సుప్రీతా భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతా మావాహయామి


ఆసనం: సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫూరద్రత్న విభూషితే,
హింహాసనమిదం దేవీ 
స్వీయతాం సురపూజితే,
రత్నసింహాసనం సమర్పయామి.


పాద్యం: సువాసితజలం రమ్య సర్వతీర్థసముద్భవం,
పాద్యం గృహాణ దేవీత్వం సర్వ దేవనమస్కతే.
పాద్యం గృహాణ దేవీత్వం సర్వ

దేవనమస్కృతే.

పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం: శుద్ధోదకం చపాపాత్రస్థం గంధపుష్పాది మిశ్రీతం,
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజతే.‚
అర్ఘ్యం సమర్పయామి.


ఆచమనీయం: సువర్ణకలశానీతం చందనాగరుసంయుతం,
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే
ఆచమనీయం సమర్పయామి.


పంచామృతస్నానం: పయోదధిఘృతపేతం శర్కరామధుసంయుతం, 
పంచామృతస్నానమిదం గృహాణ కమలాయే,
పంచామృతస్నానం సమర్పయామి.


శుద్ధోదక స్నానం: గంగాజలం 
మయానీతం మహాదేవ శిరఃస్థితం,
శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధుసోదరీ.
శుద్ధోదక స్నానం సమర్పయామి.


వస్తయ్రుగ్నం: సురార్చితాంఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్తయ్రుగ్నం ప్రదాస్వామి గృహాణ హరివల్లభే,
వస్తయ్రుగ్నం సమర్పయామి,


ఆభరణాని: కేయూరకంకణై ర్దివె్యై ర్హారనూపురమేఖలాః,
విభూషణాన్యమూలాని గృహాణ ఋషిపూజితే.
ఆభరణాని సమర్పయామి.


ఉపవీతం: తప్త హేమకృతంసూత్రం ముక్దాదామ విభూషితం,
ఉపవీతిదం దేవీ గృఋ౎ణ త్వం శుభప్రదే,
ఉపవీతం సమర్పయామి.


గంధం: కర్పూరాగరుకస్తూరీ దోచనాదిభిరన్వితం,
గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం,
గంధం సమర్పయామి.


అక్షతాన్‌: అక్షతాన్‌ ధవళాన్‌ది వ్యాదిన్‌ శాలీయాం స్తండులాన్‌ శుభాన్‌,
హరిద్రా కుంకుమో ఏతాన్‌ గృహ్యతా మబ్ధిపుత్రికే.

అక్షతాన్‌ సమర్పయామి.
పుష్పపూజ: మల్లికాజాబికుసుమై శ్చంపకై ర్వకుళ్తే స్థథా, 
పూజమామి హరిప్రియే
పుషె్పైః పూజయామి.


శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ఓం ప్రకృతె్యై నమః
ఓం వికృతె్యై నమః
ఓం విదాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూతె్యై నమః
ఓం సురభె్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచె్యై నమః
ఓం పద్మాలయాయై నమః 10
ఓం పద్మాయై నమః
ఓం శుచె్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లకె్ష్మ్య నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావరె్యై నమః 20
ఓం ఆదితె్యై నమః
ఓం దితె్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుదాయై నమః
ఓం వసుదారిణై్య నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాకై్య నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహాప్రదాయై నమః 30
ఓం బుద్ధ్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశినె్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః 40
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మాకై్య నమః
ఓం పద్మసుందరె్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖె్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దెైవె్యై నమః 50
ఓం పద్మినె్యై నమః
ఓం పద్మంధినె్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖె్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదయాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదరె్యై నమః
ఓం చతుర్భుజాయై నమః 60
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్దాజన్యనె్యై నమః
ఓం పుషె్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకరె్యై నమః
ఓం సతె్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజననె్యై నమః 70
ఓం పుష్టె్త్య నమః
ఓం దారిద్య్రనాశినె్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణై్య నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓం భాస్కరె్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్వినె్యై నమః 80
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణై్య నమః
ఓం హేమమాలినె్యై నమః
ఓం ధనధాన్యకరె్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్షై్య నమః 90
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవె్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపతె్న్యై నమః
ఓం ప్రసన్నాక్షై్య నమః
ఓం నారాయణసమాశ్రీతాయై నమః 100
ఓం దారిద్య్రధ్వంసినె్యై నమః
ఓం దెైవె్యై నమః
ఓం సర్వోపద్రవవారిణై్య నమః
ఓం మహాకాళె్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వరె్యై నమః 108

అష్టోత్తరతనామూజాంమర్పయామి
ధూపం: దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం
ధూపం దాస్వామి దేవేశి వరలక్ష్మీ గృహాణ తం
ధూపం సమర్పయామి.


దీపం: ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్వామి తే దేవి గృహాణ ముదితా భవ.
దీపం సమర్పయామి.


నెైవేద్యం: నెైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే.
నెైవేద్యం సమర్పయామి.


పానీయం: ఘనసారసుగంధేన మిశ్రతం పుష్పవాసితం,
పానీయం గృహ్యతాం దేవి శీతలం వసుమనోహరం.
పానీయం సమర్పయామి.


తాంబూలం: పూగీఫలసమాయు క్తం నాగవల్లీ దళెైర్యుతం,
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
తాంబూలం సమర్పయామి.


నీరాజనం: నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం,
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే.
నీరాజనం సమర్పయామి.


మంత్రపుష్పం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
నారాయణప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా.
మంత్రపుష్పం సమర్పయామి.


ప్రదక్షిణాన్‌: మానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ,
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
ప్రదక్షిణం సమర్పయామి.


నమస్కారాన్‌ : నమసై్తల్రోక్య జనని నమస్తే విష్ణువల్లభే,
పాహిమాం భక్తవరదే వరలక్షై్మ్య నమోనమః.
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్‌ సమర్పయామి.


అథ తోరగ్రంథి పూజా
ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి
ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజననె్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి
ఓం మహాలక్షై్మ్య నమః పంచమగ్రంథి పూజయామి
ఓం క్షీరాబిధతనయాయై నమః షష్టమగ్రంథి పూజయామి
ఓం శిశ్వసాక్షిణై్య నమః సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదరె్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమః నవమగ్రంధిం పూజయామి

తోరబంధన మంత్రం
బధ్నా మిదక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం,‚
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే.

(ఈ మంత్రం పఠిస్తూ తోరము కట్టుకోవలెను)

వాయనవిధిః
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః, 
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే.

వాయనదాన మంత్రః
ఇందిరాప్రతిగృహ్ణాతు ఇందిరా వెై దదాతి చ,
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
(ఇతి పూజ్యావిధానమ్‌ సంపూర్ణమ్‌)

అథ కథా ప్రారంభః
ఖ:ళఋ౎ష శిఖరే రమ్యే నానాగణనిషేవితే, మందార విటపీప్రాంతే నానామణి భూషితే. పాటలాశోకపున్నాగ ఖర్జురవక్ళున్వితే, కుబేర వరుణేంద్రాది దిక్పాలెైశ్య సమావృతే.
నారాదాగస్త్య వాల్మీకి పరాశరసమావృతే. రత్నపీఠే పుఖాసీనం శంకరం లోకశంకరం. పప్రచ్ఛగౌరీ సంతుష్టా లోకానుగ్రహకావ్యయా.

గౌరీ ఉవాచ :-
‚భగవన్‌ సర్వలోకేశ సర్వభూత హితేరత, యద్రహత్యమిదంపుణ్యం తదాచక్ష్వ మమానఘ. 

అంథాంగ పూజా
ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి
ఓం చపలాయయై నమః జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః ఊరూం పూజయామి
ఓం కమలవాసినె్యై నమః కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠె్యై నమః కంఠం పూజయామి
ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి
ఓం శ్రీయై నమః ఓష్టా పూజయామి
ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి
ఓం సునేత్రై నమః నేత్రం పూజయామి
ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః శిరః పూజయామి
ఓం వరలక్ష్తె్య నమః సర్వాణ్యంగాని పూజయామి


కథ విన్నంతనే సర్వశుభాలు
పూర్వం సూత మహాముని శౌనకాది మహాముని వర్యులతో ఈ విధంగా తెలుపుతున్నాడు. ఓ ముని శ్రేష్ఠులారా! స్త్రీలకు సకల సౌభాగ్యాలు మొదలగు శుభఫలితాలు కలిగేటటువంటి ఒక వ్రతంకలదు. అట్టి మిహమాన్వితమైన వ్రతవిధానమును పార్వతీదేవికి ఈ విధంగా తెలిపాడు. ఓ మనోహరి! స్ర్తీలకు పుత్ర పౌత్రాది సర్వసౌభాగ్యములు, సంపత్తులు కలిగేలా చేసే మహిమా న్వితమైన ఒక వ్రతం కలదు. అట్టి వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి (శ్రావణ పౌర్ణమి)కి ముందు శుక్రవారం రోజున చేయాలి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి అని తెలిపాడు. ఆ సమ యంలో పరమేశ్వరుడితో పార్వతీ దేవి ‘ఓ దేవా! ఇట్టి మహిమాన్వితమైన వ్రతాన్ని మొదటిసారిగా ఎవరు ఆచరించారు? వ్రతవిధానాన్ని వివరించండి’ అని కోరిం ది. దానితో శివుడు ఆ వ్రత విధానాన్ని వివరించాడు. ‘ఓ పార్వతీ దేవి! కాత్యాయనీ! మహి మాన్విత మైన వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరముగా వివరించెదను, వినుము ... మగధ దేశంబున కుండినంబు అను ఒక పట్టణము ఉన్నది.

ఆ పట్టణము బంగారు ప్రాకార ములతో, బంగా రపు గోడలు గల ఇళ్ళతో ఉన్నది. ఆ పట్టణంలో చారు మతి అను ఒక బ్రాహ్మణ స్ర్తీ ఉన్నది. ప్రతి రోజు ప్రాతః కాలంలో తలస్నానం చేసి పుష్పాలతో దెైవారాధన చేసి, అనంతరం అత్తమామలకు ఉపచారాలు చేస్తూ ఇంటి పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో ప్రియంగా సంభా షిస్తూ ఉండేది. చారుమతికి మహాలక్ష్మీ అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహం కలి గింది. నీ తపోభక్తికి మెచ్చితిని. నీవు శ్రావణ శుక్ల పౌర్ణ మికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ప్రార్థించి ఆరాధిస్తే, నీవు కోరిన వరములు ప్రసాదించెదను అనగా, చారుమతీ దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ, నమస్కారములు చేసింది. 

నమస్తే సర్వలోకానాంజననె్యై పుణ్యమూర్తయే
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే...

అని దేవిని ప్రార్థిస్తూ, ఓ జగజ్జననీ, నీ అనుగ్రహం కలి గిన జనులు ధన్యులు. విద్వాంసులగుదురు. సకల సంప దలు కలుగును. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషంబు వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని ప్రార్థించింది. మహాలక్ష్మీదేవి సంతోషంతో చారుమతికి అనేక వరాలిచ్చి అదృశ్యమైంది. వెంటనే చారుమతి నిద్ర లేచి ఇంటిలో నాలుగు దిక్కులా చూడగా, వరలక్ష్మీదేవి కనిపించక పోయే సరికి అదంతా స్వప్నం అని గ్రహించి ఆ స్వప్నవృత్తాంతమును కుటుంబసభ్యులకు తెలిపింది.చారుమతీ దేవి తెలిపిన వరలక్ష్మీమహత్యము విన్న స్ర్తీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 

కొన్ని రోజుల అనంతరం ...శ్రావణ మాస పౌర్ణమి ముం దు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఈ శుక్రవారమే చారుమతి తెలిపిన శుక్రవార మని స్ర్తీలంతా ప్రాతః కాలంలో నిద్రలేచి తలస్నానం చేసి చారుమతి ఇంటికి వెళ్ళారు. గోమయంతో వారు ఆ స్థలాన్ని శుద్ధి చేసి ముగ్గు వేసి పూజామంటపం ఏర్పాటు చేశారు. ఆ మంటపంలో వస్త్రం పర్చి, దానిపెై బియ్యం పోసి కలశం సిద్ధం చేసుకొని ఆ కలశమునకు పసుపు, కుంకుమలతో అలంకారాలు చేశారు. వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్ర్తీలంతా భక్తితో పూజ చేశారు. 

శ్లో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే 
నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా

అనే శ్లోకంతో అమ్మవారికి ధాన్యవాహనాది షోడశోప చార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరము లను పూజించి కుడిచేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులు నివేదనం చేసి, అనంతరం ప్రదక్షిణం చేశారు. ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ స్ర్తీలం దరికీ కాళ్ళ వద్ద ఘల్లు ఘల్లుమనే శబ్దం వచ్చింది. కాళ్ళ ను చూడగా గజ్జెలు మొదలగు ఆభరణాలుండెను. వారం తా ఓహో! ఇవి వరలక్ష్మీ కరుణాకటాక్షంతో మనకు ప్రసా దించినవి అని ఆనందంతో రెండవ ప్రదక్షిణం చేసిన సమయంలో తమ శరీరాలపెై ప్రత్యక్షమైన నవరత్న ఖచి తములెైన కంకణములు, ఆభరణములు చూసి పరమానందంతో మూడవ ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్ర్తీలం తా సర్వాభరణ అలంకార భూషితలెై ఉన్నారు. చారుమతి మొదలగు ఆస్ర్తీలందరి గృహములు స్వర్ణమయములెై రథ గజ తుర వాహనములతో నిండియున్నవి. వరలక్ష్మీదేవిని ఆరాధించగా అమ్మవారు కృపా కటాక్షాలు ప్రసాదించిం దని స్ర్తీలంతా సంతోషించారు. తమతో అమ్మవారి పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడిని గంధపుష్పాక్షితలుచే పూజించి 12 కుడుములు, పాయసము దక్షిణ తాంబూల ములు సమర్పించారు. బ్రాహ్మణోత్తముడి ఆశీర్వచనాలు పొంది, తీర్థప్రసాదాలు స్వీకరించి తమ ఇళ్ళకు బయలు దేరినారు. 

చారుమతీ దేవి భాగ్యమును స్ర్తీలు ఒకరికొకరు చెప్పు కుంటూ మహామహిమాన్వితమైన మహా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలకు పాత్రులయ్యామన్న సంతోషం పొందా రు. నాటి నుంచి చారుమతి మొదలగు స్ర్తీలంతా ప్రతి సంవ త్సరం అమ్మవారిని ఆరాధిస్తూ, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా ఉన్నారు- అని పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రత విధానాన్ని వివరించాడు. అంతేగాకుండా, ఈ కథను విన్న వారు, చదివిన వారు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల సంపదలు పొందుదురని తెలిపినాడు. 

Friday, August 5, 2016

శ్రావణ మాసపు తొలి శుక్రవారం శుభాకాంక్షలు
కనకధారా స్తోత్రం:
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపెడుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి
శ్లో1!! అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ !
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: !!
తా : ఆడ తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క
ఓరచూపు నీలమేఘశ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ
వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో,
అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా
కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !
శంకరులు ఇక్కడ ముందుగా విష్ణుభగవానుని నామాన్ని చెప్పి తల్లి
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసిన మొట్టమొదటి శ్లోకం ఇది.
తల్లి నిత్యానపాయని కదా విష్ణువుని కీర్తిస్తే తాను ఎక్కువ సంతోష
పడుతుంది. ఇందులో శంకరులు హరేః అన్న నామాన్ని ప్రస్తావించారు. వేరు
నామాల్ని ఏవీ ప్రస్తావించలేదు. హరి అంటే సకల పాపాలను హరించేవాడు అని కదా
అర్థం. ఒకవేళ బీద బ్రాహ్మణి పాపాలు ఎక్కువగా ఉంటే వాటిని తేలికగా
తీసేయగలిగినవాడు శ్రీ హరి. అందుకు ఈ నామం వాడారు.
అలాగే తమాల వృక్షం అన్న పదాన్ని వాడారు. తమాల వృక్షాన్ని చీకటి చెట్టు
అని అంటారు అది నల్లగా ఉంటుంది. ఊరి బయట సముద్రపుటొడ్డున స్మశానాలలో
ఉంటుంది. అందరూ వదిలేసి వెళ్ళినా స్మశానంలో నేనున్నాని చెప్పి
పాపపుణ్యాలకతీతంగా జీవునికి తోడుగా స్మశానంలో ఉండేది తమాల వృక్షం. మరి
అలాంటి నీలమేఘ సంకాశుడైన విష్ణుభగవానుడు కూడా అంతేగా పాపపుణ్య ఫలప్రదాత/
పాపపుణ్యాలకతీతంగా జీవులని ఉద్దరించగలడు. అలాగే ఈ బీద బ్రాహ్మణ
కుటుంబాన్ని కూడా పాపపుణ్యాలకతీతంగా ఉద్దరించగలడు.
అంతటి గొప్ప కారుణ్యాన్ని వర్షించగల విష్ణుభగవానుడు నీ చూపులు తగిలేసరికి
అతని శరీరము పులకాంకితమౌతుంది. తమాల వృక్షానికున్న బొడిపెలలాంటి
మొగ్గలమీద ఆడ తుమ్మెద ఎలాతిరుగుతున్నదో అలా నీచూపులు కారుణ్యపూర్తమైన
విష్ణుభగవానుని శరీరము మీద సోకేసరికి శ్రీహరికి పులకాంకురాలు కలిగి అవే
ఆభరణాలుగా మారాయి.
నీచూపులను అంగీకరించిన విష్ణువుయొక్క మహదానందమునకు కారణమై అఖిల విభూతులకూ
సకలైశ్వర్యములకూ పుట్టినిల్లువైన తల్లీ లక్ష్మీ దేవీ! ఆ చల్లని చూపులు
ఒకసారి మావంక ప్రసరింపజేస్తే విష్ణు భగవానుడు అనునయంగా మా పాపాలను తొలగ
తోస్తాడు తద్వారా నీవు మాకు సమస్త మంగళములు కల్గించెదవుగాక !
(సందర్భానుసారం: తల్లీ! పాపాలెన్నో కలిగి పుణ్యరాశిలేని ఈ బీదబ్రాహ్మణ
కుటుంబ పాపాలను తొలగతోయగలిగిన శక్తిఉన్న దంపతులు మీరు, ఏకాదశి వ్రతం చేసి
ద్వాదశి పారణకై వేచి ఉన్నారంటే ఆ శ్రీ హరిని పూజించువారేకదా, దానిద్వారా
వారి పాపాలను ధ్వంసం చేయడం మీకు సాధ్యమే. ఇక పుణ్యం విషయానికి వస్తే
ఇదిగో ఇప్పుడే నాచేతిలో ఉసిరికాయ దానం చేసింది, ఆ కొంత పుణ్యాన్ని కొండంత
పుణ్యంగా మార్చే కరుణామూర్తులు మీరు, అది అడ్డం పెట్టి ఈ బ్రాహ్మణ
కుటుంబానికి సంపత్తిని కలుగజేసి దారిద్ర ధ్వంసనం చేయి)
శ్లో2!! ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:
ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని !
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: !!
తా : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె
విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని
ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు
గాక !
ఈ శ్లోకంలో విష్ణు భగవానుని "మురారేః" అని సంబోధించారు బాల శంకరులు.
మురారి అంటే ముర అనే రాక్షసుని చంపినవాడు లేదా శత్రువు అని అర్థం.
మురాసురుడు బ్రహ్మగారి కొరకై తపస్సు చేసి లోకాలన్నీ జయించటంకొరకు తాను
ఎవరినైతే ముట్టు కుంటాడో వారు మరణించేటట్టు వరం ఇవ్వమన్నాడు (ఇంకో విధంగా
అన్వయిస్తే తన చేతితో ముట్టుకున్నదేదో తనచే ఓడింపబడాలి అంటే తన
స్వంతమవ్వాలి). అటువంటి మురాసురుడు తరవాత దేవతలపైకి దండెత్తి వెళితే
దేవతలందరూ పెద్ద యుద్ధంలేకుండానే పారిపోయారు. అమరావతిని సొంతం చేసుకుని
విలాసాలననుభవిస్తూ తన వాహనంపై లోక సంచారం చేస్తూ భూమిమీదకు వచ్చాడు. భూమి
మీద సరయూ / గంగా తీరంలో రఘుమహారాజు దేవతల కోసం యజ్ఙం చేయటం చూసి కోపగించి
దేవతలకు హవిస్సు ఇవ్వరాదు అని ఆజ్ఙాపించాడు, కూడదంటే తనతో యుద్ధానికి
రమ్మన్నాడు. అంతలో వశిష్టుడు అనునయంగా మాట్లాడి ఈ భూమిపై జీవులనందరినీ యమ
ధర్మరాజు సంహరిస్తుంటాడు కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేసి గెలిస్తే అంతా
నీదే అవుతుంది అని చెప్పగా మురుడు యమసదనానికి వెళ్ళాడు. మురుని రాక
గురించి వశిష్థుని ఉపాయం గురించి తెలుసుకున్న యమధర్మరాజు, మురునికి
స్వాగతం చెప్తాడు. మురుడు యముణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు యుద్ధం
వద్దనుకుంటే భూమి మీద ఎవ్వరినీ చంపవద్దని ఆదేశిస్తాడు. అంత యమధర్మ రాజు
మురునితో అలా చేయటానికి తనకి అధికారంలేదనీ చేసినా తన పై అధికారైన
విష్ణువు తనను దండిస్తాడని చెప్పగా మురుడు అదేదో విష్ణువుతోనే
తేల్చుకుంటానని వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం లో క్ష్రీర సముద్రం మధ్యలో
విలాసంగా ఆదిశేషుని మీద పడుక్కుని ఉన్న శ్రీ హరితో ఆ మురాసురుడు
యుద్దానికి రమ్మని రంకెవేస్తాడు, జరిగినది తెలుసుకున్న శ్రీహరి ఆ
మురాసురునితో యుద్ధం సరేకానీ నాతో యుద్ధమంటే నీగుండె ఎందుకు అలా భయంతో
కొట్టుకుంటోంది. నాతో యుద్దమంటే నీకు భయంలాగుంది అని అనగానే మురుడు
తత్తరపడి నాకు భయమా ఎవరిగుండె కొట్టుకుంటోంది అని తన చేతిని తన గుండె
మీదపెట్టుకుంటాడు వెంటనే ఆ శ్రీ హరి తన చక్రాయుధంతో మురుని చేతితోసహా
ఖండించి సంహరించాడు.
అటువంటి శ్రీహరిని తన సాగరమథనం జరిగినప్పుడు అందులోంచి పైకి వచ్చిన
తల్లివైన నువ్వు చుట్టూ ఎంతమంది ఇతర దేవతలున్నారో రక్కసులున్నారో కూడా
చూడకుండా ముగ్దలా అమాయకురాలిలా ఆ మురాసురుని సంహరించిన ఆ శ్రీ హరి ఈయనే
అని కన్నార్పకుండా మోహంతో చూసిన చూపులు మాకు సిరిసంపదలు కటాక్షించుగాక.
అలా చూస్తున్న చూపులు అందరూ చూస్తున్నారని గ్రహించి , కలువ మీద మళ్ళీ
మళ్ళీ వచ్చి చేరే ఆడ తుమ్మెద లాగా, నీ చూపులను మరల్చి మరల్చి, తిప్పి
తిప్పి, ప్రేమ+సిగ్గు ల దొంతరలతో శ్రీ మహావిష్ణువును ముగ్ద మోహనంగా
చూపులున్న ఓ తల్లీ లక్ష్మీ దేవీ మమ్ములను నీ చల్లని చూపులు
అనుగ్రహించుగాక!
సందర్భం:
మురాసురుడంటే ఎవ్వరికీ పెట్టకుండా అంతా తనదే అని దాచుకునేవాడు. అటువంటి
పాపగుణాన్ని ఎవ్వరికీ పెట్టక అంతా నాది నేను అన్న చేయితో సహా శ్రీహరి
నిర్మూలించాడు. పూర్వజన్మలో ఒకరికి పెట్టకనే కదా ఈ జన్మలో ఈ బ్రాహ్మణ
కుటుంబం దరిద్రం అనుభవిస్తోంది ఆ దానం చేయని పాపాన్ని శ్రీహరి
నిర్మూలించగలడు తల్లీ అని అంతర్లీనంగా మురాసురుని సంహార వృత్తాంతం
సంకేతించారు.
శ్లో3!! విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతురధికం మురవిద్విషోపి !
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయాః!!
తా : ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో
కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ
బ్రహ్మకి సోదరీ ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూడ్కులు మాపై
ప్రసారముచేయుదువుగాక!
వివరణ: ఇక్కడ కూడా విష్ణుమూర్తిని పరోక్షంగా మురారి అని మురవిద్విషోపి
అన్న పద ప్రయోగం ద్వారా సంబోధించారు శంకరులు. దానము చేయకుండా తనదిగా
అన్నీ దాచుకున్నవానికి శత్రువైన శ్రీమహావిష్ణువు దేవాంద్రాదులకు
స్వర్గాది లోకములను తన దయతో దానమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది ఎలా
జరిగింది అని చూస్తే. ఒకానొకనాడు దుర్వాసో మహర్షి అమ్మవారిచ్చిన పుష్ప
హారాన్ని చేత బట్టుకుని వెళ్తూండగా దేవేంద్రుడు ఐరావతం మీద ఎదురైనప్పుడు
దేవేంద్రునికి మంగళం చెప్పి ఆశీర్వదించి దుర్వాసో మహాముని ఇంద్రునికి
అమ్మవారిచ్చిన పుష్పహారాన్ని ఇచ్చారు. తరవాత అహంకారంతో ఉన్న దేవేంద్రుడు
ఆ హారాన్ని ఐరావతం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తద్దోషంగా లక్ష్మీ దేవి
పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రుని అహంకారం వల్ల లక్ష్మీ దేవి
దేవలోకాన్నే కాక వైకుంఠాన్ని కూడా వదిలి పాల సముద్రంలో చేరిపోయింది.
తరవాత ఇంద్రుడు అన్ని బాధలు పడ్డాడు, తరవాత క్షీర సాగర మథనం జరిగి
లక్ష్మీ దేవి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ చేరింది(ప్రకటంగా
చేరింది, వారిద్దరూ విడివడినదెన్నడు గనక?). అటువంటి అహంకారి, నీ
ప్రసాదమైన పుష్పమాలనే తిరస్కరించినవాడు రాజ్య భ్రష్టుడౌతే, స్వయంగా శ్రీ
మహావిష్ణువే ఇంద్రునికి తమ్ముడుగా, పన్నెండు నెలలు గర్భవాసం చేసి
వామనావతారమెత్తి, ఇంద్రునికి తమ్ముడు కనుక ఉపేంద్రుడను పేరు పెట్టుకుని,
ఒకరికి ఇవ్వడమే ఎరిగిన శ్రీహరి, బలి చక్రవర్తి వద్ద చేయిచాచి దానమడిగి
మూడులోకాలనూ కొలిచి బలిని పాతాళానికి త్రొక్కి అలా దానంగా సంపాదించిన
రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి గుండెలలో ఉండేదానివి
నీవు. నీ చల్లని చూపులతో అంత దయగలిగిన విష్ణుమూర్తికే ఎంతో ఆనందాన్ని
కలిగించేదానవు.
విష్ణు మూర్తి నల్లని కలువ పువ్వైతే అందులోని సౌకుమార్యం అంతా ఆయన దయ.
దాని మధ్యలోనున్న దుద్దు అతి సుకుమారం మధ్య భాగం ప్రకాశవంతం ఇంకా చల్లన.
చల్లని నల్లని విష్ణుమూర్తి అనే కలువ పువ్వుగుండెలోని అత్యంత
సౌకుమార్యమైన అత్యంత చల్లనైన మధ్య భాగం వంటి లక్ష్మీ దేవివినువ్వు.
పువ్వుకన్నా మధ్యభాగంలోనే ఆర్ద్రత, చల్లదనం ఎక్కువ. మరి ఆ చల్లని
చూడ్కులు మాపై ప్రసారం చేసి మమ్మల్ని రక్షించవా తల్లీ!
సందర్భం ప్రకారం: క్రిందటి శ్లోకంలో చేప్పినట్లు దానం చేయనివారికి
శత్రువైన విష్ణుమూర్తి (మురారి), స్వయంగా తానే ఇంద్రునికోసం దానం పట్టి,
తద్వారా వచ్చిన దాన్ని ఇంద్రునికి దానమిచ్చేశాడు. శ్రీ హరిగా పాపాలను
తీయగలడు కానీ దారిద్రాన్ని తీసి పుణ్యఫలంగా ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు
అన్నదానికి ఉదాహరణగా పైన చెప్పిన దుర్వాసో మహర్షి, అమ్మవారిచ్చిన పూమాల,
ఇంద్రుడు, క్షీరసాగర మథనం, వామన, బలి చక్రవర్తి కథ మొదలైనవి సూచించారు.
అంటే భగవంతుని, భాగవతుల పట్ల చేసిన తప్పునే దిద్ది తిరిగి ఐశ్వర్యాన్ని
రాజ్యాన్ని ఇవ్వగల దయ కలిగిన హృదయం కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ
చల్లని విష్ణువు గుండెలలో ఇంకా చల్లగా ఉన్న తల్లివి నువ్వు, ఎంతో దయగల మీ
ఇద్దరూ,ఈ బ్రాహ్మణ కుటుంబం యొక్క పాపాలను తీసి వీరిని ఉద్దరించి
ఐశ్వర్యాన్ని కలుగచేయవలసినది అని శంకరులు ప్రార్థించారు.
శ్లో4!! ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్ !
ఆకేకర స్థిర కనినీక పద్మనేత్రం
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః !!
తా:ఆమ్మా లక్ష్మీదేవీ! ఎప్పుడూ ఆనందమునిస్తూ కొద్ది కొద్దిగా తెరచియున్న
కన్నులున్నవాడు, మన్మథుని తంత్రమును వశము చేసుకొనినవాడు, ఆదిశేషునిపై
శయనించువాడు ఐన మహావిష్ణువు యొక్క పత్నివి నీవు. అర్థనిమ్మీలిత నేత్రాలతో
స్థిరమైన చూపులతో పద్మము వంటి కనులతో శ్రీ మహావిష్ణువును చూచే
చూడ్కులున్న తల్లీ మీ ఈ కళ్యాణ రూపము నాకు కళ్యాణ రూపము నాకు కళ్యాణమును
కలిగించు గాక.
వివరణ: ఇక్కడ శంకరులు ముకున్ద అన్న పదంతో శ్రీ మహావిష్ణువుని
సంబోధించారు. ముకున్ద అన్న పదానికి మోక్షమునిచ్చువాడు అని అర్థము. ఏ
సంసార బాధలు లేక కేవలము మోక్షమును కోరే వారు ఆశ్రయించు వాడు శ్రీ
మహావిష్ణువు. తాను ఎల్లప్పుడూ అర్థ నిమ్మీలిత నేత్రాలతో తన భక్తులను
రక్షిస్తూ వారికి ఆనందము కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు. ఐతే ఆ శ్రీ
మహావిష్ణువు మన్మథుని తంత్రాన్ని వశము చేసుకున్నవాడు అని ఈ శ్లోకంలో
చెప్పారు, అసలు మన్మథుడు ఆయన కొడుకే కదా, ఆ మన్మథునికి ఉన్న శక్తికి కూడా
కారణం ఆ విష్ణువే. ఇక ఆయన భుజగశయనుడు, పాము మీద పడుక్కుంటాడు. ఈ రెంటి
అర్థం ఏమంటే జనన మరణాలకై అతీతంగా మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు. మన్మథుడు
పుట్టుకకు కారకుడు, మన్మథ బాణం తగిలితేనే కదా జీవుల జననం సంభవిస్తుంది.
పాము మృత్యువునకు సంకేతం, పాము కాటు వేసిందంటే మృత్యువు గ్రసించినట్టు
అని అర్థం. మరి శ్రీ మహావిష్ణువో, అందరి పుట్టుకకీ కారణమౌతున్న
మన్మథుణ్ణే కన్నవాడు, మృత్యువును తన తల్పంగా కలిగినవాడు, అంటే తన
అవసరానికి ఆసనంగా, తల్పంగా వాడుకునేవాడు. అంటే ఈ రెంటికి అతీతుడు. మరి
మోక్షాన్ని ఇచ్చి కామాన్ని, మరణాన్ని శాసించగలవాడు అలాగే తన భక్తులనీ
కాపాడుకో గలిగినవాడు. (ఇక్కడ శ్రీ హరిని పరబ్రహ్మ తత్త్వంగా సృష్టి,
స్థితి, లయలను ఆధీనములో కలవానిగా కీర్తించారు శంకరులు). అటువంటి శ్రీ
హరిని పద్మములవంటి తన కళ్ళతో కనుపాప కదలకుండా స్థిరమైన చూపులతో సగము
మూసిన కనులతో చూచి మన్మథ తన్త్రాన్నే వశము చేసుకున్న శ్రీ మహావీష్ణువుకు
ఆనందము కలిగించు చూపులున్న తల్లీ ఆ మీ కళ్యాణ కారకమైన చూపులు మాకు కూడా
కళ్యాణమును కలిగించు గాక! అని ప్రార్థించారు.
సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీ దేవీ! ఈ పేద బ్రాహ్మణ కుటుంబానికి
ఏపుణ్యమూ లేదు అని కాదా నీవు ఐశ్వర్యమివ్వడానికి కుదరదన్నావు. సరే,
నువ్వు స్వయంగా జనన మరణాలకు అతీతంగా ఉండి తన భక్తులను రక్షించే శ్రీ
మహావిష్ణువుకి ఇల్లాలివి. వీరేమో ఏకాదశీ వ్రతం చేసి ద్వాదశి పారణ విధిగా
చేస్తున్నవారు. మరి శ్రీ మహావిష్ణువు తన భక్తులు రక్షించే గుణమున్నవాడు.
ఆయనకి ఎప్పుడూ ఆనందం కలిగించేదానవు నువ్వు, మన్మథుని పుట్టుంచిన ఆయనకే
ఆనందం కలిగించే నీ చూపులు, ఒక్క సారి ఈ బీద బ్రాహ్మణ కుటుంబం మీద పడితే
దాని వల్ల వారు ఉద్దరింపబడితే, శ్రీ మహావిష్ణువు నీ చూపుల ద్వారా తన
భక్తులు ఉద్ధరింపబడ్డారని ఇంకా ఆనందం పొందగలడు. తల్లీ ఆ మీ చల్లని కళ్యాణ
కారకమైన చూపులచే మాకందరికీ కళ్యాణమగు గాక!
శ్లో5!! కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: !!
తా : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన
వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ
భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !
వివరణ: శంకరులు ఇక్కడ శ్రీ హరిని కైటభారే అని సంబోధించారు, ఇక కైటభారే
అన్న విషయానికొస్తే, మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సృష్టి
ఆరంభంలో సంహరించారు. మధు కైటభులు ఇద్దరూ సోదరులు, వారెవరో కాదు,
మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. నాది అనేటప్పటికి మనం మన చేతులను
గుండెలమీదపెట్టి నాది అంటాం. అటువంటి గుణానికి ప్రతినిధి ఐన కైటభుని
సంహరించినవాడు శ్రీ హరి. అంటే అటువంటి గుణమునకు శత్రువు అని అంతర్లీనంగా
కైటభ వృత్తాంతాన్ని పొందు పరిచారు శంకరులు.
అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని కురవడానికి
సిద్దంగా ఉన్న నల్లనిమేఘంతో పోలిక వేశారు. శ్రీహరిని నీల మేఘ శ్యాముడని
పిలుస్తారు, కురవడానికి సిద్దముగా ఉన్న మేఘం, మీన మేషాలు లెక్కపెట్టదు,
ఎవరున్నారు ఎవరు లేరు చూడదు, దాహార్తి తో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఆ
ఒక్కడికే కురుద్దామని మేఘము ఆలోచించదు. ఒక్కపెట్టున తన దగ్గరున్నదంతా
కురిసేసి వెళ్ళిపోతుంది. అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు.
కారుణ్యమనే నీటితో నిండిన ఈ నల్ల మబ్బు గుండెలో దాక్కుని ఒక్కసారిగా
స్ఫురించిన మెరుపు తీగ/ తటిల్లత/ బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి. మెరుపు
తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకూ ఆహ్లాదకారకములెలాగో, అలా ఒకరిలో
ఒకరైన మీ ఇద్దరి దర్శనము మాకు భద్రము చేయుగాక. అమ్మా మెరుపు తీగ
స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే, ఆ మెరుపులో మేఘ
స్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యమున్న దానవు (అంటే అమ్మ దయ ఉంటే
అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్న భావన, భగవంతుని సౌందర్య దర్శనము
చేయించినది అమ్మ. అంతేకదా!). అమ్మా నువ్వు అందరకూ తల్లివి కదా మరి
అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించాలికదా. అమ్మా అంత కారుణ్యమున్న భగవంతుని గుండెలలో ఉన్న దానవు
నువ్వు. అమ్మా ఆ భగవంతుని కారుణ్యము, ఔదార్యము నువ్వే కదా. అలా వీరిని
ఉద్దరించగలిగిన శక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వే కదమ్మా!
సందర్భం
పూర్వ జన్మలలోఅలా నాది నాది అని గుండెలమీదనే చెయ్యిపెట్టుకుని చెయ్యిని
తిరగేసి దాన ధర్మాలు చేయలేదు కనకనే బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు
దరిద్రం ఉన్నది అటువంటి దరిద్రాన్ని తొలగతోసే మేఘ స్వరూపమైన భగవంతుని
కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేయించగలిగి, ఆయన గుండెలలో
ఉండే నువ్వు ఒక్క సారి కారుణ్యాన్ని వర్షింపజేయి. ఈ బీదబ్రాహ్మణి
అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది. అమ్మ తనానికే పరాకాష్ట
నువ్వు. అన్ని జగములకూ అమ్మవు నువ్వు. అమ్మా మరి ఆ అమ్మ ఇచ్చిన భిక్షను
నేను సంతోషం తో స్వీకరించాలంటే మరి ఈ అమ్మ కష్టాన్ని తీయలేవా. ఎంత
కారుణ్యముంటే నువ్వు భృగుమహర్షికి కూతురిలాపుట్టావు తల్లీ. అంత
కారుణ్యమున్న మీరిరువురూ ఒక్కసారి కారుణ్యామృత చూపులు ఒక్కసారి మెరుపు
మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దారిద్ర్యం తొలగిపోతుంది.
శ్లో6!! బాహ్యాంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి !
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయా: !!
తా : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి
దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు
కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !
వివరణ: శ్రీ శంకరులు ఈ శ్లోకంలో శ్రీ హరిని మధుజితః అన్న నామంతో
సంబోధించారు. పై శ్లోకంలో వివరించినట్లు మధువు=నేను; కైటభుడు=నాది అనే
గుణాలు. ముందు నాది అనే భ్రాంతిని తొలగతోసి తరవాత నేను అనే అహంకారాన్ని
తొలగతోయగలడు శ్రీ హరి అన్న అర్థాన్ని స్ఫురించేలా ముందు శ్లోకంలో కైటభారే
అని తరవాత శ్లోకంలో మధుజిత్ అన్న నామాన్ని వాడారు. నేను నాది అన్న భావన
పోయిననాడు మనిషికి పాప కర్మలు చేయవలసిన పని ఉండదు, నేను నాది అన్న భావన
తొలగుతే అంతా పరబ్రహ్మమును చూస్తూ ఆత్మగా మిగిలిపోయి, తన పక్కవారి బాధను
తనదిగా తలచి వారికి వలసిన దాన ధర్మాలు సహాయాలు చేయగలడు. మధు కైటభులను
సంహరించిన శ్రీమహావిష్ణువు వక్షస్థలమందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండి తన
చూపులను ప్రసారం చేయగా ఆ చూపులు ఆయన హృదయంలోనూ, బయట ఉన్న కౌస్తుభమణికి
గొప్పనైన ప్రకాశముని ఇవ్వగలిగిన చూపులు ఆ చూపులు. తనతోపాటు సముద్రములో
పుట్టునదే ఐనా ఆ కౌస్తుభమణి కాంతులు ఆ అమ్మ చూపుల కాంతి వల్లనే
ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టు తల్లి లక్ష్మీదేవిని
"కమలాలయాయాః" అని సంబోధించారు. ఆ విష్ణువక్షస్థలవాసిని ఐన ఆ తల్లి నల్లని
చల్లని చూపులు విష్ణు భగవానుని గుండెలపై వేసిన ఇంద్రనీలమణుల హారములవలె
ఉన్నాయి. అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సునుచేకూర్చుగాక.
సందర్భం ప్రకారం: అమ్మా స్వయంగా శ్రీ విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగల
శక్తివి నీవు, విష్ణుభగవానుడు ఇతరుల కోర్కెలు తీరుస్తున్నాడూ అంటే దానికి
మూల శక్తివి నువ్వెకదమ్మా! నేను నాది అన్న భావంతోటే పోయినజన్మలో చేసిన
పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నారు ఈ బీద బ్రాహ్మణులు.
అందరికోర్కెలు తీర్చే విష్ణుభగవానునికి ఆ కోర్కెలుతీర్చేశక్తిగా ఉన్నది
నువ్వేకదమ్మా ఆయన గుండెలలో. అటువంటి మీ చూపులు ఒక్కసారి వీరి మీద
ప్రసరిస్తే ఆ చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి అని శంకరులు
ప్రార్థించారు.
శ్లో7!! ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన !
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: !!
తా : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ
విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా)
మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన
మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !
వివరణ: ఈ శ్లోకంలో కూడా శంకరులు మధుమర్దిని అన్న పదాన్ని విష్ణువుకు
వాడారు, ఆంతరంగా అమ్మవారికీ ఈ పదాన్ని వాడారు. అలా ఎలా అంటే, మధు
కైటభులను శ్రీహరి సంహరించినప్పుడు జగజ్జనని మధు కైటభులను మోహపరచడానికి
(కామప్రదమైన) తన చూపులను మధుకైటభులపై ప్రసరింపజేయగా దానితో విర్రవీగిన ఆ
రాక్షసులు విష్ణువుకే వరం ఇవ్వడానికి సిద్దపడగా విష్ణువు వారి చావునే
వరంగా కోరాడు అలా ఆ తల్లి తన చూపులతో మొట్టమొదటి రాక్షస సంహారంగా తన
చూపులతో విష్ణువును అనుగ్రహించి అందరికీ అన్నీ ఈయగల విష్ణువుకు మధుకైటభ
సంహారం అనే కోరిక తీర్చినది. దీనిద్వారా మధుమర్దిని అన్న నామం
శ్రీమహావిష్ణువుకు అమ్మవారికీ కూడా చెందుతుంది. ఏ అమ్మవారి చూపుల
ప్రభావంచేత మధుకైటభులు మోహాంధులై సంహరింపబడ్డారో, ఏ చూపుల వలన మధువనే
రాక్షసుని చంపే మంగళకార్యం శ్రీహరి చేయగలిగెనో, అటువంటి చూపులు కలిగిన
తల్లి లక్ష్మీ దేవి (ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకరులు
కొలుస్తున్నారు) విష్ణుభగవానుని హృదయమనే స్థానాన్ని అలంకరించినట్టి
లక్ష్మీదేవి, నిర్హేతుకంగా మొసళ్ళు మొదలగు కౄర ప్రాణులు నివసించు
సముద్రుని కరుణించి కూతురుగా పుట్టిన తల్లి లక్శ్మీదేవి తన నెమ్మదైన,
కరుణాపూరితమైన నిమ్మీలిత నేత్ర దృష్టిని మాపై ప్రసారం చేయుగాక.
సందర్భం ప్రకారం: అమ్మా లక్ష్మీదేవీ, ఏ కారణముందని నీ కరుణతో తనలో ఎన్నో
కౄరప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురువయ్యి లక్ష్మీదేవి
తండ్రి అని సముద్రునికి కీర్తినిచ్చావు? అది నీ అపార దయ కారుణ్యం, అది
నిర్హేతుకము. అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని
ఉద్దరించవా. అమ్మా నీ మోహపు చూపుల ప్రభావంచేతనేకదా మధువనే రాక్షసుని వధ
అనే మంగళ కార్యమును శ్రీమహావిష్ణువు నిర్వర్తించినాడు. ఒకేసారి నీ
చూడ్కులు రాక్షసులు సంహరింపబడడానికి, శ్రీమహావిష్ణువు రాక్షస సంహారమనే
మంగళకార్యముచేయడానికి హేతువులైనాయి కదా. మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి
ఏ హేతువులేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే, నీచూపులను ప్రసారించి అవే
హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లీ. అందరికోర్కెలు తీర్చే
విష్ణుభగవానుని కోర్కెలే తీర్చగలిగిన నీచూపులు దరిద్రులైన వీరిని
ఉద్దరించగలవు. కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపైన వర్షింపజెయి.
శ్లో8!! దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే !
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: !!
తా : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి
విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ
దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా
తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !
విశేషార్థము : "అకించన" అన్న పదానికి 'దరిద్రుడు' అని, 'పాపములు
లేనివాడు' అని రెండర్థాలు.
వివరణ: ఇక్కడ శ్రీ హరిని నారాయణ అన్న నామంతో అమ్మవారిని నారాయణ ప్రణయినీ
అన్న నామంతో సంబోధించారు శంకరులు. నారాయణ అన్న పదానికి నీటికయ్య లేదు
పుష్కలమైన నీరుఉన్న ప్రదేశము ఇల్లుగా కలవాడు అని అర్థముకూడాఉన్నది.
(సమస్త జీవజాలమూ విశ్రాంతి తీసుకొను ప్రదేశము అన్న అర్థముకూడా ఉన్నది).
నీరు ఎక్కువగా కావలసినది బాగా తాపము, దాహమున్నవారికి. ఆ నీటినే ఇల్లుగా
చేసుకున్నవాడు విష్ణుభగవానుడు. మరినువ్వో ఆ విష్ణుభగవానుని పత్నివి.
నీకన్నులనిండా కారుణ్యము ఆర్ద్రత అనే నీటిమేఘాన్ని కలిగి ఉన్నదానివి.
అమ్మా మేఘాలు ఏంచేస్తాయమ్మా, భరింపరాని గ్రీష్మతాపాన్ని పోగొడతాయి. అమ్మా
గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న పక్షిపిల్లకు కలిగే వేడిని దయ అనే చూపులతో
తొలగతోసి, విషాదంలో మునిగిఉన్న ఈ పక్షికి నీ కన్నులనిండా నల్లగా ఉన్న
మేఘమనే కరుణార్ద్ర చూపులను ప్రసరించి కారుణ్యాన్ని వర్షించి తాపాన్ని
తీర్చమ్మా.
సందర్భం ప్రకారం:
విహంగ శిశౌ అనే అర్థంతో పక్షిపిల్ల అన్న అర్థంతోపాటు, బ్రాహ్మణులు అన్న
అర్థం కూడా వస్తుంది. పక్షి గుడ్డుగా ఒకసారి పిల్లగా ఒకసారి జన్మిస్తుంది
కాబట్టి ద్విజ అని అంటారు. అలానే బ్రాహ్మణులకి కూడా ఉపనయనం అయ్యినతరవాత
ద్విజ అని సంబోధిస్తారు. కాబట్టి విహంగ శిశౌ అని అన్నప్పుడు ఈ
బ్రాహ్మణులకి అన్న అర్థం కూడా అన్వయమౌతుంది. తాపంతో ఉన్నవారికి
నీరిస్తే సరిపోతుంది కదా మళ్ళీ దయ అనే చూపులతో వేడిని తీయడమెందుకు? అంటే
ఇప్పుడు తాపం తొలగుతుంది మళ్ళీవేడి పుట్టినప్పుడు మళ్ళీ తాపం పుడుతుంది.
అమ్మా ఇప్పుడు వీరికి కావలసిన ఐశ్వర్యమే కాదు, ఇప్పటిదాకా
ఐశ్వర్యంపొందకుండా అడ్డుగా ఉన్న పాపాలని నీవు దయతో తొలగతోయలేదా, నువ్వు
ఐశ్వర్యమిచ్చినా వారి పూర్వ పాపం వల్ల అది భ్రష్టమౌతుంది. కాబట్టి తల్లీ
వారి పూర్వజన్మ పాపాలని తీసి కురియడానికి సిద్దంగా ఉన్న నీకళ్ళనే మేఘాలని
వారిపై వర్షించు. మరి పాపాలంటే తీస్తాను కాని ఇవ్వడానికి పుణ్యమేదీ అని
అంటావేమో! ఇదిగో నాకు దానం చేసిన ఉసిరికాయ ఇంకా నాచేతిలోనే ఉంది
అదేసాక్ష్యం. దయ అనేసముద్రాన్ని ఇల్లుగా చేసుకున్నవాడు నారాయణుడు, అతని
పత్నివైన నీవో ఆ దయనే కళ్ళల్లో, కారుణ్యాన్నే చూపుల్లో పెట్టుకున్నదానివి
నువ్వు. మీ చల్లని చూపులు మాదారిద్రమనే తాపాన్ని, పూర్వజన్మపాపాలను
పోగొట్టుగాక.
శ్లో9!! ఇష్టాః విశిష్ట మతయో౭పి నరా యయా౭౭
దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే!
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: !!
తా : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు)
తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో
విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను
పొనరించు గాక !
వివరణ: ఈస్తొత్రంలో బాల శంకరులు అమ్మవారిని లక్ష్మీ దేవిగానే కాక
ముగురమ్మలుగా కీర్తిస్తున్నారు, ఎవరి చల్లని కంటి చూపువలన మానవులు వాంఛా
ఫలత్వము, గొప్పనైన బుద్ధి మరియు జ్ఙానమును పొంది అంత్యమున స్వర్గాది
లోకములను మోక్షమును పొందుతున్నారో ఆ చూపులకు కారణమైనటువంటి బాగుగా
విప్పారినటువంటి కమలముల లాంటి అందమైన కళ్ళు కలిగిన ( బాగా విప్పారిన
కమలము మధ్యలో చల్ల దనము, తడి బిందువులు ఉంటాయి, అంటే అమ్మవారి కన్నిలు
బాగా విప్పారి భక్తుల ఆర్తి తీర్చడానికి తడి ఉన్న కన్నులు అని
చెప్పటానికి ఈ ఉపమానం వేశారు శంకరులు), పద్మము పై విరాజిల్లిన
లక్ష్మీదేవి యొక్క ఆ చల్లని కృపాదృష్టి మా అందరిపై వర్షించు గాక.
సందర్భం ప్రకారం: అమ్మా నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబం ఆర్తిని
తీర్చలేనిదానవుగాదు. నిన్ను ఆశ్రయించిన వారికి కేవలం ఐశ్వర్యమే కాదు సకల
కోరికలు తీర్చగలవు, జ్ఙానమియ్యగలవు, స్వర్గాదులు మోక్షము ఇయ్యగలవు.
అందుకు ఋజువు లోకంలో ఎందరో పండితులు నిన్ను స్తుతి చేయడమేగదా. అందరికీ
అన్నీ ఈయగల నువ్వు ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి నువ్వు కలిగిన తాపాన్ని
తీయడానికి నీ కృపాపూర్ణ దృక్కులు మాపై ప్రసరించెదవుగాక.




Monday, February 29, 2016

యోగ విద్య



యోగ  విద్య..!!

          యోగ శక్తులు ప్రదర్శన చేసేవారిని అనుమానించడం అవమానకరంగా మాట్లాడటం సర్వసాధారణం. ఏదో గట్టి దృష్టాంతం మనసుకు హత్తుకుంటే తప్ప మహిమా ప్రదర్శన చేసే వారిని నమ్మని రోజులు దాపురించినవి , నమ్మకాలు ఎప్పుడు సన్నగిల్లునొ అప్పుడే మహిమాత్ములు భూమి పై రావడం తగ్గిస్తారు ... ఏదో 100 సంవత్సరాలకు ఒక్క మహానుబావుడు మనల్ని ఆదుకోడానికి పూనుకుని వచ్చి మనిషికి మించిన శక్తి ఒకటి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నదని నిరూపించి మనవ అహంకారాన్ని సంహరించి మరల స్వధామానికి చేరుతున్నారు . ఆ కోవకి చెందినా వారే సత్యసాయి , షిర్డీ సాయి , ఆది శంకరాచార్య , అక్కల్కోత్కర్ మహారాజ్ , నృశింహ సరస్వతి , రాఘవేంద్ర స్వామి , కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర సరస్వతి , మౌన స్వామి, గణపతి సత్ చిదానంద తదితరులు .. అయితే వీరు ఇప్పుడు లక్షల్లో లేక కోట్లల్లో ఒక్కరే పుడుతున్నారు ..కాని వీరు ప్రదర్శన చేసే విద్యలు పూర్వ కాలం లో ఎందరో చేసేవారు . పూర్వ కాలం లో ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరజ్ఞానం కాదు యోగ శక్తి మరియు సిద్ధులు పొందటమే వెనుకటికి విద్య యొక్క పరమావధి . గురు కులం లో ఇట్టి యోగ శక్తులే నేర్పేవారు. వీటికి ఉదాహరణలే మన పురానములల్లో మనుష్యులు జంతువులతో మాట్లాడటం , ఉన్నవాడు ఉన్నట్టుగా పర్వతం వలె చాలా ఎత్తు పెరగడం లేక ఒక అంగుళం వరకు తగ్గడం లాంటివి ... ఇవ్వి చదివి చాలామంది కల్పిత కధలు అనుకుంటారు కాని ఇవ్వన్ని పాతంజలి యోగ సూత్రములు అనే శాస్త్రములో పతంజలి మహర్షి చాలా స్పష్టంగా వివరించారు . అవ్వి ఈ క్రింద విధంగా ఉన్నవి
          1.  అణిమా సిద్ధి :అతి చిన్న ఆకారంగా మారడం.
హనుమ సముద్రమును దాటే సమయం లో సురస అనే రాక్షసి పెట్టిన పరీక్ష నెగ్గుటకు బొటన వ్రేలంత గా మారి నోట్లోనికి వెళ్ళి సురస యొక్క దంతాలకు చిక్కక బయట పడ్డాడు.
          2.  మహిమాసిద్ధి : అతి పెద్ద ఆకారంగా మారడం .
హనుమంతుడు సముద్రమును దాటాలని సంకల్పించి తన ఆకారమును మహిమా సిద్ధి చే పెంచి ఆ పై దూకాడు.
          3.  లఘిమాసిద్ధి :వాయు సమానమైన బరువుతో ఆకాశ ప్రయాణం చెయ్యడం , నిమిషం లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యడం.
సంజీవిని పర్వతం తీస్కో రావడానికి హనుమస్వామి లఘిమా సిద్ధిని ఉపయోగ పెట్టారు.
          4.  గరిమాసిద్ధి :శరీరము యొక్క బరువు విపరీతంగా పెంచడం
రాముని దూతగా వెళ్ళిన అంగదుడు రావణ కొలువులో , వానరులను తేలిక చేసి మాట్లాడతున్న రావణాసురుని ఉద్దేశించి , మీ కొలువులో ఎవరైనా నా పాదమును జరపగలరేమో ప్రయత్నం చెయ్యండి అని పలుకగా , ఎవ్వరూ ఆ పని చెయ్యలేక చతికిలాపడ్డ విషయం మనకి తెలిసేందే
          4.  గరిమాసిద్ధి :శరీరము యొక్క బరువు విపరీతంగా పెంచడం
రాముని దూతగా వెళ్ళిన అంగదుడు రావణ కొలువులో , వానరులను తేలిక చేసి మాట్లాడతున్న రావణాసురుని ఉద్దేశించి , మీ కొలువులో ఎవరైనా నా పాదమును జరపగలరేమో ప్రయత్నం చెయ్యండి అని పలుకగా , ఎవ్వరూ ఆ పని చెయ్యలేక చతికిలాపడ్డ విషయం మనకి తెలిసేందే
          5.  ప్రపత్తి : ఆకాశమంత ఎత్తు పెరగడం ; దూర శ్రవణం ; దూర దర్శనం ;మనో దర్శనం (మైండ్ రీడింగ్);జంతు భాషలు అర్ధం కావడం తిరిగి వాటి తో సంభాషణ చెయ్యడం; సకల రోగాల ను నయం చెయ్యడం
వామన మూర్తి బలి చక్రవర్తిని సంహరించడానికి ఆకాశమంత పెరగడానికి ఈ విద్య ఉపయోగాపెట్టాడు. దూర దర్శన ,దూర శ్రవణ విద్యల ద్వారా వ్యాస వాల్మీకులు భారత రామాయణాలు రాసారు.. సత్యసాయి వారు భక్తుడు మాట్లాడక ముందే అతను అడగాలని అనుకున్న ప్రశ్నలన్నిటికీ చక చకా సమాధానం చెప్తూ సాగిపోయ్యేవారు. అట్లే షిర్డీ బాబా తన వద్దకి వచ్చిన భక్తుల స్వంత విషయాలు భక్తుడు నోరు విప్పకుండానే చెప్పేవారు. దూర దర్శన సిద్ధి కలిగినవాడు మనో నేత్రం తో తాను అనుకున్న ప్రదేశములను, మనుషులను అట్లే సంఘటనలను చాల స్పష్టంగా చూడగలడు. ఈ సిద్ధి కలిగిన పారాశర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే 9 గ్రహాలు ఉన్నాయని అవి పనిచేసే తీరు ఎలా ఉంటుందో కూడా పరాశర సంహిత ద్వారా జ్యోతిష్య శాస్త్రమును రచించి ప్రజలకు అందించాడు.అంతకు పూర్వం కూడా నారద , జైమిని వంటి వారు అట్లే దర్శించి జ్యోతిష్య ఫలితాలు రచించారు . తరువాతి కాలం లో కలికాలపు scientist లకు అట్టి శక్తులు లేవు కాబట్టి వందల కోట్ల డాలర్లు వెచ్చించి టెలీస్కోపుల ద్వారా చూచి ఆ 9 గ్రహాల పేర్లే చెప్పారు. కలి మానవుడి శక్తి సన్నగిల్లిపోయిన కారణంగా మంత్రం తో చెయ్యలేనివి యంత్రం తో చెయ్యడానికి నా నా తంటాలు పడుతున్నాడు కానీ యోగ శక్తి తో సమానమైన శక్తి ని కనుక్కోవడం సాధ్యమా ..!!.? ... ఇక రోగాలు నయం చెయ్యడంలో షిర్డీ సాయి సత్యసాయి లు పెట్టింది పేరు. ఇక మన పురాణ కధలల్లో జంతువులతో సంభాషణ ఎన్నో చోట్ల ఉన్నది .రావణుని తో జటాయు సంభాషణ, అట్లే హనుమతో సంపాతి సంభాషణలే ఉదాహరణలు.
          6.   ప్రాకామ్య సిద్ధి :నీటిలో నివాసము చేసి , కావాలనుకున్నప్పుడు మరల భూమి పైకి రావుట , పరుల శరీరం లో కి వెళ్ళుట:
దుర్యోధనుడు నీటిలో కి వెళ్ళి తపమాచరించినట్లు మనకు మహాభారతం లో చెప్తారు. త్రిలింగ స్వామి నీటి లో ఆరు నెలలు వసించాడని యోగులు, పెద్దలు చెప్తారు. శ్రీ ఆదిశంకరులు రాజా అమరుక దేహం లోనికి పరకాయ ప్రవేశం చేసినట్లు శంకరుల జీవిత చరిత్రలో స్పష్టంగా ఉన్నది.
          7.   వశిత్వ సిద్ధి : సర్వ జనులు వశీకరణం చెందటం ఇందులో విశేషం.
ఈ సిద్ధి పొందిన గురువుల ఆధీనములో సర్వ దేశ ప్రజలు , రాజులూ ఉంటారు. ఎవరెన్ని ఉపాయాలు చేసినా వీరిని అనుసరిచే శిష్య బృందం పెరుగుతూనే ఉంటుంది . వీరు నమ్మిన ప్రతి భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటారు. ఈ సిద్ధి విశేషంగా ఒక జీవిత కాలం లో ప్రదర్శన చేసిన వారు శ్రీ కృష్ణ పరమాత్మ,సత్యసాయి . దాదాపు ప్రపంచ రాజులంతా అతన్ని భగవంతుని గ అవతారం చాలించక ముందే అనుభవించి ఒప్పుకున్నారు..ఒప్పుకొక ఎదురు తిరిగిన వారు చాలా తక్కువ ,అట్లు ఒప్పుకోక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన శిశుపాలుడు వంటి వారు చంపబడ్డారు , అట్లే సత్యసాయి దర్శనానికి ఒక్కోరోజు 14 నుండి 15 దేశాల అధినేతలు ఆశిస్సుల కోసం వచ్చేవారు , ప్రతీ భారత దేశ ప్రధాని మరియు రాష్ట్రపతి సత్యసాయి ని మానవాతీత శక్తి గా పరిగణించి పుట్టపర్తి వెళ్ళి ఆశీస్సులు పొందుట మనకి తెలుసు. అట్లే 155 దేశములల్లో సత్యసాయి భక్తులు దేవాలయాలు కట్టుకుని ప్రార్ధిస్తున్నారు , అతనితో పాటు రాముడు , కృష్ణుడిని కుడా వారు పూజిస్తూ ఉన్నారు.
వశిత్వ సిద్ధిలో క్రూర జంతువులు సైతం వశమైపోతవి , అరణ్యములల్లో సాధన చేసేవారు ఈ సిద్ధి పొంది క్రూర జంతువుల వలన ఏ భయమూ లేక తపమాచరించేవారు .
          8.   ఈశిత్వసిద్ధి: పూర్తిగా మహేశ్వర తత్వాన్ని ప్రదర్శన చెయ్యడం , జగత్తులో సర్వం ఈ సిద్ధి ద్వారా వశమైపోవును . విశ్వానికి ప్రభువుగా తన శక్తి ప్రదర్శన జరుగును.
చనిపోయిన వారిని బ్రతికించ కలగడం ఈ సిద్ధి పొందిన వారిలో ప్రత్యేకం.
సత్యసాయి కరణం సుబ్బమ్మ ను మరణించిన మూడవ రోజు లేపి తులసి తీర్ధమిచ్చిమరల పరలోక ప్రయాణం చేయించడం వందల మంది సమక్షం లో బుక్కపట్టణం లో జరిగింది. అట్లే నృశింహ సరస్వతుల వారు మరణించిన భర్తను పట్టుకు వచ్చిన స్త్రీని సుమంగళి గా ఉండమని దీవించి ఆ మరణించిన వ్యక్తిని లేపాడు.. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు ఆ దంపతులు హాయిగా జీవనం చేసారు.
          9.   స్వర్ణ సిద్ధి : బంగారమును సృష్టించడం
సత్యసాయి తమ అవతార సమయం లో దాదాపు ప్రతి రోజు ఇట్టి సిద్ధిని ప్రదర్శించారు . అట్లే మౌన స్వామి కుర్తాళం లో అనేక సార్లు ఈ మహిమ చేసి చుపారు.
          10.   కామ రూప సిద్ధి
తను సంకల్పించిన శరీర రూపమును పొందుట , హనుమంతుడు ఈ సిద్ధి ని ఉపయోగ పెట్టి ఒక విప్రుని రూపం లో వెళ్ళి సుగ్రీవుని ఆజ్ఞ పై రాముల వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు .
          11.   యతః సంకల్ప సిద్ధి
ఇష్ట వస్తువుని సంకల్ప మాత్రముగా పొందుట
          12.   భూత జయ సిద్ధి
పంచభూతముల పై ఆధిపత్యము సాధించుట. గాలి , నీరు , నిప్పు వంటి పంచభూతముల ప్రవర్తనను సంకల్ప మాత్రమున నియంత్రించుట లేక సృస్టించుట

praveen sarma

Friday, February 26, 2016

నమో శ్రీ వెంకటేశ



అల్లనల్లన అమృతంపు జల్లు చల్లు
చల్ల చల్లని దివ్య హస్తములు నీవి
ఆ కరమ్ములు శుభముల కాకరములు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశ్వరా! మెల్ల మెల్ల గా అమృతంపు జల్లు ను చిలకరించెడి దివ్య హస్తములు నీవి. ఆ నీ దివ్య హస్తములు సర్వ శుభములకు నిలయములు కదా ప్రభూ !. సర్వ శుభములకు నీ దివ్య ఆశీస్సులే కారణములు.
మంద మారుత సంస్పర్శలందు కరగి
కమ్మతేనెలు చిందు నెత్తమ్మి లీల
తన్మయంబగు నీ స్మృతిన్ మన్మనంబు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీనివాసా ! హే జగన్నివాసా! మలయ మారుతములతో పులకించి, కమ్మని తేనెలను చిందించు తామరపువ్వు వలె నా మనస్సు నీ స్మరణ తోనే పులకించి పోతోంది ప్రభూ !
( Ravi Prasad Muttevi గారు వ్రాసిన గీతాలు )

సూర్యనారాయణ


సూర్యుని ఎందుకు ఆరాధించాలి.🍀🌻🍀
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. -ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. -వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి. -సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.
🌹👏 సూర్యనారాయణ మహదేవ దేవ నమస్తే నమస్తే నమస్తే నమ:.🌹👏

దశ దానాలు


ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే దానం అనేది ఉన్నవాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మనం ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పదేవిధముగాను అవస్యముగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి
దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..
గోదానం
గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదానం
తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దానం
హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం
ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదానం
శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం
జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దానం
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయండి .

Thursday, February 25, 2016

కోణార్క్ సూర్యదేవాలయం



కోణార్క్ సూర్యదేవాలయం-అద్భుతాలకు నిలయం...
భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం::
ఈ క్షేత్రం చంద్రభాగా నది తీరాన ఉంది...
ఈ దేవాలయాన్ని మేగ్నటైట్(సూదంటురాయి) లాంటి రాళ్ళతో నిర్మించారు...
అవన్నీ ఒక క్రమ పద్దతిలో ఒక దాని మీదుగా అమర్చటం వలన సూర్యదేవుని
విగ్రహం గాలిలో తేలి ఉండి, వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది...
ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖ ద్వారం కూడా ఎంతో విలువైనది..
ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఎంత శక్తివంతమైనవంటే
ఆ ఆలయం దగ్గరలో తిరిగే హెలికాప్టర్ లను సైతం ఆకర్షించగలిగేంత అట...
దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల
నిమిత్తం ఇంగ్లాండుకు తీసుకుని పోయారని ఒక కథనం..
ఈ క్షేత్రంలోసూర్యభగవానుడు ఇరవైనాలుగు చక్రాల తో,
ఏడు అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా
ఉంటుంది.... ఆ ఇరవైనాలుగు చక్రలు ఒక
రోజులోని గంటలకు సూచన...
ఏడు గుర్రాలు ఏడు రోజులకు సూచన... ఈ
అశ్వాలు చాలా రౌద్రంగా భయానకంగా కనపడి
చూపరులను భయ పడే విధంగా ఉంటాయట
(ప్రస్తుతం శిధిలమైనాయి).. ఏనుగులు నిజంగా
ఉన్నాయేమొనని అనిపించేంత ఉంటాయట...
ఈ ఆలయ కుడ్యాల మీద రసరమ్య శిల్పాలు,
నాట్యభంగిమలు ... ఇవి మాటలకందని అద్భుతాలని
చెప్పవచ్చు.. ఈ ఆలయం కట్టడానికి
పదహారు సంవత్సరాలు పట్టిందట... దీనికై
దాదాపు పన్నెండు వందల మంది
శిల్పకారులు పనిచేసారట.. ఎంతకీ ఈ ఆలయ గోపురాన్ని
వాటి మధ్య సూర్యభగవానుడు తేలే విధంగా
చేయడం వారికి సాధ్యమవలేదట... రేపటి రోజులోపులో ఈ
గుడి నిర్మాణం పూర్తి కావాలి లేదా అందరికీ శిరచ్చేదమే
అని రాజు ఉత్తర్వులు జారీ చేసి వెళ్ళి పోతారట..
సాయంత్రం దాకా ఏమీ తేలలేదు తెల్లారితే శిరచ్చేదమే
అని బాధతో నిశ్క్రమిస్తారట... అయితే అందులో ఒక శిల్పి
తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పనిలో చేరతాడి..
ఆశిల్ప శిల్పకారుడి కుమారుడి పదహారవ ఏడున ..
తన తండ్రి ని చూడాలని వచ్చి ఆ రాత్రి వారి
సమస్యను చూసి వెంటనే ఆ రాత్రే పరిష్కరించి ...
ఆలయ శిఖరాన్ని పూర్తిచేసి వారందరిని ఆశ్చర్య
చకితులను చేస్తారట...అయితే అంతటి
మహత్కార్యాన్ని పూర్తిచేసిన అతన్ని చూసి మిగిలిన
వారిని రాజు చంపేస్తాడనే భయంతో ఆ
కుర్రవాడు చంద్రభాగా నదిలో ఆత్మహత్య
చేసుకున్నాడని ఒక కథనం... ఆ కుర్రవాడు భారత
నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం... కానీ ఈ ఘటన ఈ
ఆలయానికి ఒక శాపమైందనే కథనం కూడా ఉంది... ఈ
ఆలయం చాలా సార్లు ముష్కరుల దండ
యాత్రకు ... ఆంగ్లేయుల దాష్టికానికి గురై ... తన
వైభవాన్ని దాదాపు కోల్పోయి
ప్రస్తుతం కొంచెం కొంచెంగా
వెలుగొందుతోంది... జీవిత కాలంలో ఒక్కసారిఅయినా
చూడతగిన క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం...

మానస సరోవరం



మానస సరోవరం 

సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది.

కల్పవృక్షం ఇక్కడే ఉంటుందని కుబేరుడి నివాసం కూడా ఇక్కడే అని విష్ణుపాదోద్భవ గంగ కైలాసశిఖిరికి చేరి దానిని ప్రదక్షించి అక్కడి నుంచి నాలుగు నదులుగా మారి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్మలి నదుల పుట్టుక ఇక్కడే. మానససరోవరంలో మునిగి కైలాసపరిక్రమ చేసినవారికి జన్మరాహిత్యమే అంటారు. శివునిలో లీనమై తామే శివస్వరూపులైపోతారని చెబుతారు. కల్పవృక్షం ఇక్కడే, గంగ భూమిని చేరింది ఇక్కడే ఇటువంటి కైలాస మానస సరోవరం దర్శనం అనేక జన్మల పుణ్యం.

ఒక్కోసారి భయాందోళనలతో ఒడలు జలదరింప చేసే అనుభవాలూ, భక్తిపారవశ్యంతో తనువు పులకరింప జేసే దివ్య అనుభూతుల సమ్మేళనం కైలాస మానస సరోవరయాత్ర ఒక వింత అద్భుతం. ఆధ్యాత్మికతలను అందించే ఒక అద్భుత యాత్ర.

కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితః ప్రభో
అగస్త్యదేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖరః

కళ్ళు మూసుకుని శ్లోకాన్ని అంటూ ఉండగా, కైలాస పరవతాన్ని కళ్ళల్లో ఊహించుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి అదిగో 'కైలాస్' అనడం, మేము కారు దిగిపోవడం ఒక్కసారిగా జరిగాయి. ఎదురుగా అల్లంత దూరాన మౌంట్ కైలాస్ శిఖరం తెల్లగా వెండిపర్వతంలా మెరిసిపోతూ కనిపించింది. 'ఎన్ని జన్మల పుణ్యమో కదా ! పరమేశ్వరా! ఎప్పటి నుంచో వస్తున్న పాపాలు....నీ దర్శన భాగ్యంతో హరించుకుపోతాయి. ఈ అల్పజీవి మీద నీకు ఇంత కరుణ ఎందుకు స్వామి!"

దేవతల అర్ధరాత్రి స్నానాలు ..!

మానససరోవరంలో ప్రతిరోజు అర్దరాత్రి దేవతలు వచ్చి స్నానం చేసి కైలాసంలోని ఈశ్వరున్ని దర్శిస్తారు అని కళ్లకు నక్షత్రరూపంలో మాత్రమే కనిపిస్తారని అంటారు. ఈ సరోవరంలో హంసలు ఉంటాయని అదెంతమాత్రం నిజమో, కాని హంసల్లాంటి పక్షులు ఉన్నాయి. మానససరోవరానికి ఇంకోవైపు రాక్షసతాల్ అనే ఒక సరోవరం ఉంది. ఇక్కడ రాక్షసులు స్నానం చేస్తారని మరెవ్వరూ స్నానం చెయ్యరు అని దీని మధ్యలో చిన్న రాతిగుట్ట మీద రావణాసురుడు శివుని కోసం తపస్సు చేశాడని, కైలాసపర్వతం ఎత్తబోయాడని అంటారు.
మానసరోవరం అనేది చైనా కు చెందిన టిబెట్ ప్రాంతంలో గల మంచినీటి సరస్సు,
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో భారత దేశం, టిబెట్, నేపాల్ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన హంసలు మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరం గా చెపుతారు.

ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్చమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక. స్వచ్చమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మానస సరోవర పరిధి దాదాపు 90కి,మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి అధారం మానససరోవర జలం. ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం. వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.

చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్ధం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండీ ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము. 1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండీ 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండీ కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మానసిక సంకల్పంతో పాటు శారీరకం గా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండీ ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి. సముద్ర మట్టం నుండీ 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణం లో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్తితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి.

"సంకట హర చతుర్ది"


సుద్ధ చవితి రోజున ఉదయం పూత పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం పోదున పూజ చేసిన చద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి .
సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు , అ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి . రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యానం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచితంగా తిధి సమయం చూసుకోవాలి.

ధర్మ సింధు లాంటి గ్రంధాలో మనకి చేపెటువంటి విషయం ఏంటి అంటే "తదియతో కలిసిన చవితి " చెయాలి తప్ప పంచమి తో కలిసిన చవితి చేయకూడదు. ఇలా చేయటం వలన సంకటాలు అని తొలిగి పోవు. తిధి నిర్ణయం తప్పు జరుగుతుంది . శాస్త్ర ప్రకారం చవితి చేయడం లేదు .

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.


సంకష్ట హర చతుర్థి: 
సంకష్ట హర చతుర్ధి లేక సంకష్ట చతుర్ధి లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి అనేది ప్రతి మాసం కృష్ణ పక్షంలో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.

ప్రాముఖ్యత: 
అసలు ఈ సంకట చతుర్ధి ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట అంటే కష్టములు లేక ఇబ్బందులు... సమస్యలు హర అంటే హరించటం...రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు. అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.
విమానయానం: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

పాప దృష్టి: 
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

పాపాత్మురాలు: 
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు.

వ్రత ఫలితం: 
ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గానీ స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అప్పుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. 

ఏడు జన్మల మోక్షం 
హిందువులలో ఉన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్త్రీ/ పురుషులలో మోక్షం పొందటానికి ముందు 7 జన్మలు ఎత్తుతారు. ఆ ఏడు జన్మల అనంతరం మోక్షం పొందుతారు. కానీ ఎవరైతే సంకష్టహర చవితి చేస్తారో వారు గణేష లోకానికి వెడతారు. వారికిక పునర్జన్మ అనేది ఉండదు. 
వ్రత ఫలితం: ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకునికి పూజ చేయాలి. పూజలో కూడా సంకట నాశన గణేశ స్తోత్రమ్‌ ప్రత్యేకంగా 3సార్లు పఠించాలి. ఎవరెవరు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో అవి అన్నీ తీరుతాయి. విద్యార్ధులకు విద్య, సంతానార్థులకు సంతానం, ధనాన్ని కాంక్షించే వారికి ధనం.. ఇలా ఎవరెవరికి కావలసిన విధంగా వారు మనసారా వినాయకుని పూజించి, వేడుకొని వినాయకునికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం దక్షిణ భారతీయులే కాక ఉత్తర భారతీయులు కూడా అమితంగా పాటిస్తారు.

షోడశోపచార పూజ: 
ఎవరైనా పెద్దవారు మనింటికి వస్తే ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ఎలా మర్యాదలు చేస్తామో, అదే రకంగా మన ఇష్టదైవాన్ని 16 రకాల ఉపచారాలు చేసి సేవించటమే షోడశోపచార పూజా విధానం. ఇది మన సత్సంప్రదాయం.

1. ఆవాహనం - వారిని మన ఇంటిలోకి మనస్ఫూర్తిగా రమ్మని ఆహ్వానించుట.
2. అర్ఘ్యం - కాళ్ళు, చేతులు కడుగుకోవటానికి నీళ్ళని వినయంగా అందించుట
3. పాద్యం- 
4. ఆసనం - వచ్చిన పెద్దలు కూర్చోవటానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయుట
5. ఆచమనీయం - మంచినీళ్ళు (దాహం) ఇవ్వడం
6. స్నానం- వారి ప్రయాణ అలసట తొలగేందుకు స్నానం వగైరా ఏర్పాట్లు
7. వస్త్రం - స్నానానంతరం ధరించేందుకు మడి లేక పొడి బట్టలు ఇవ్వడం
8. యజ్ఞోపవీతం- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9. గంధం - శరీరానికి సుగంధం, చల్లదనానికి గంధాన్నివ్వడం
10. పుష్పం - సుగంధాన్ని ఆస్వాదించేలా అలంకరణకి
11. ధూపం - సుగంధ వాతావరణం కల్పించటానికి
12.. దీపం - వెలుతురు కోసం, చీకటిలో ఉండకూడదు కనుక అనుకూలతకై
13. నైవేద్యం - తన తాహతు రీత్యా, తనకి అనుకున్న దానిని ముందుగా ఆ దైవానికి సమర్పించటం 
14. తాంబూలం- ముఖ సుగంధార్ధంగా, భుక్త పదార్ధాలలోని లోపాలు తొలగింపునకు
15. నమస్కారం - మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించమని కోరడం
16. ప్రదక్షణం - ఆ దైవం యొక్క గొప్పతనాన్ని త్రికరణ శుద్ధిగా అంగీకరించటం. 

ఏది ఏమైనా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో నాలుగవ రోజైన ఈ చవితికి అత్యంత మహిమగల చవితిగా పేరున్నందున వినాయకుని సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆనాడు ఉపవాసం రాత్రి వరకూ ఉండి తర్పక్రియుడైన వినాయకునికి ఆయనకి ప్రియమైన వస్తువులతో పూజ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఆ లంబోదరుడు మనల్ని దాటిస్తాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి కాక సంవత్సరంలో నెలనెలా వచ్చే ఈ సంకష్ట చతుర్ధిని కూడా ఆప్యాయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా దూరం అవుతాయన్నది అతిశయోక్తి కాదు. విద్య, ధనం, సంతానం, మోక్షం అన్నిటికీ కూడా ఆయన్ని పూజించి వేడుకుంటే నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది.